Ys Avinash Reddy: వివేకానందరెడ్డి చివరి కోరిక షర్మిల ఎంపీ కావడమేనట.. ఆ కోరికను అవినాష్ తీరుస్తారా?

Ys Avinash Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో స్పష్టమైన సాక్షాలను ప్రజల ముందు పెట్టి జస్టిస్ ఫర్ వివేకా పేరుతో ఆయన కుమార్తె సునీత రెడ్డి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమావేశాల ద్వారా అవినాష్ రెడ్డికి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ అవినాష్ రెడ్డిని ఇరుకున పడేస్తోంది. వివేకానంద రెడ్డి పై తమకు ఎంతో ప్రేమ ఉందని ఆయనను తాము ఎందుకు చంపుకుంటాము అన్నట్లు ప్రకటన చేస్తున్నారు అవినాష్ రెడ్డి.

అదే నిజం అయితే వివేకానంద రెడ్డి చివరి కోరిక షర్మిలను ఎంపీగా చూడటం, నిజంగా మీకు వివేకానంద రెడ్డి మీద అంత అభిమానమే ఉంటే ఆయన ఆఖరి కోరిక తీర్చే అవకాశం ఉపయోగించుకోండి, అవినాష్ రెడ్డి పోటీ నుంచి వైదొలగి షర్మిలకు మద్దతు ప్రకటించండి అని చెప్పారు సునీత. నిజానికి అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వద్దని, షర్మిలకే ఇవ్వాలని వైఎస్ ఫ్యామిలీ లో జరిగిన చర్చ కారణంగానే ఈ హత్య జరిగిందని సిబిఐ చెబుతోంది. షర్మిల కూడా అదే చెప్పటం గమనార్హం.

జగన్ కోసం ఎంతో కష్టపడిన షర్మిలకు చిన్న పదవి ఇవ్వటానికి కూడా జగన్ అంగీకరించలేదు. ఎక్కడో గుజరాత్ కి చెందిన వారికి, తెలంగాణ వారికి రాజ్యసభ పదవులు ఇచ్చారు కానీ షర్మిలను మాత్రం పట్టించుకోలేదు. ఆఖరికి ఆస్తి కూడా ఇవ్వటానికి ఇష్టపడలేదు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జగన్. అయితే ఇప్పుడు సునీత ఇచ్చిన సలహా పాటించి అవినాష్ రెడ్డి షర్మిల కోసం పోటీ నుంచి తప్పుకొనే అవకాశం లేదు.

పైగా సునీత కౌంటర్స్ కి రీకౌంటింగ్ ఇవ్వటానికి అవినాష్ విచిత్రమైన వాదనలతో తెరమీదకి వస్తున్నారు. అంతేకాకుండా వృద్ధుడైన తండ్రి జైల్లో ఉంటే తాను మాత్రం బెయిల్ పై బయట దర్జాగా తిరుగుతున్నాడని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు అవినాష్. ఏదైనా సునీత కౌంటర్స్ కి సరియైన సమాధానం చూపించలేకపోతే అవినాష్ రెడ్డి ఇరకాటంలో పడటం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలవారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -