Nani vs Chinni: ఓటర్లకు ఫుల్ కిక్ ఇస్తున్న బెజవాడ బ్రదర్స్ వార్.. విజేతగా నిలిచేదెవరో?

Nani vs Chinni:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు విజయవాడ రాజకీయాలు చాలా కీలకంగా ఉంటాయని చెప్పాలి. అలాంటి విజయవాడ పార్లమెంటు స్థానాన్ని గెలుపొందాలని ప్రతి ఒక్క పార్టీ ఆశపడుతుంది అయితే ఈసారి మాత్రం విజయవాడ పార్లమెంట్ టికెట్ విషయంలో పెద్ద పోటీ ఉందనే చెప్పాలి. గతంలో విజయవాడ పార్లమెంటు కంచుకోటగా కాంగ్రెస్ ఉండేది కానీ గత పది సంవత్సరాల కాలంలో ఐదు సార్లు టిడిపి గెలుపొందింది.

ఇక వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ రెండు సార్లు కూడా విజయవాడలో వైసిపి జెండా ఎగర లేకపోయింది. విభజన తర్వాత విజయవాడ టిడిపి కంచుకోటగా మారిపోయింది.2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని 74వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ గెలుపొందారు. 2019లోనూ ఆయనే బరిలో ఉన్నారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తున్నా విజయవాడలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది.

ఈసారి మాత్రం రాజకీయాలు విజయవాడలో కాస్త తారుమారు అవుతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే గత రెండు ఎన్నికలలో విజయవాడలో విజయకేతనం అందుకున్నటువంటి కేసినేని నాని ప్రస్తుతం వైసీపీలోకి వచ్చేసారు. ఈ క్రమంలోనే వైసిపి నుంచి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని నాని బరిలోకి దిగారు.

ఈసారి కేశినేని నాని వైసీపీ తరఫున పోటీలో ఉండగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇలా విజయవాడ పార్లమెంట్ స్థానానికి ఓకే కుటుంబం నుంచి అన్నదమ్ములు రెండు పార్టీల నుంచి పోటీ చేయడంతో ఈ స్థానం పట్ల ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి కూడా అక్కడ టిడిపి జెండా ఎగురుతుందని గత రెండుసార్లు వైసిపి నుంచి పోటీ చేసి కనుమరుగైన అభ్యర్థుల జాబితాలో కేసినేని నాని ఉంటారని అక్కడ ప్రజలు పూర్తిస్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏ జెండా ఎగురుతుంది అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -