Hero Nani: సినిమా షూటింగ్‌లో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరో నాని..?

Hero Nani: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన సహజమైన నటులతో ప్రేక్షకులలో మనసులలో స్థానం సంపాదించుకున్న నాని అతి తక్కువ సమయంలోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. నాని ప్రస్తుతం జయప్రజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన నాని ప్రస్తుతం తన తదుపరిచిన సినిమా పై దృష్టిని సారించాడు. ఇకపోతే ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా సినిమాలో నటిస్తున్నాడు.

అయితే ఇటివలే ఈ సినిమాకు కొంత విరామం తీసుకున్న నాని దసరా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వార్తను విన్న నాని అభిమానులు భయపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. తాజాగా దసరా సినిమా షూటింగ్ లో చిన్న అపశృతి చోటుచేసుకున్నట్లు సమాచారం. కాగా దసరా సినిమా కథ బొగ్గు గనుల చుట్టూ తిరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ గోదావరి ఖనిలో జరుగుతోంది. సినిమా షూటింగ్‌లో భాగంగా బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో బొగ్గంతా అతడి పై పడినట్లు తెలుస్తోంది.

అయితే అదృష్టవశాత్తు నానికి ఎలాంటి గాయాలు కాలేదట. దీంతో చిత్రీకరణకు కొద్దిసేపు అంతరాయం కలిగిందట. నాని ఆ చిన్న ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత త మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టారట. కాగా ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నాని సుమారు 7 కేజీల బరువు తగ్గినట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -