YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఆ కంచుకోట బీటలు బారుతున్నాయని తెలుస్తోంది.

గత ఎన్నికలలో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసును అడ్డుపెట్టుకునే విజయం సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అదే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తన ఓటమికి కారణం అయ్యేలా చేస్తుంది. తన సొంత చెల్లెలు వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా ఎన్నిక అవ్వడమే కాకుండా కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటం విశేషం.

ఇలా అవినాష్ రెడ్డి పై పోటీకి దిగినటువంటి ఈమె తన బాబాయిని చంపిన హంతకులకు ఓటు వేయొద్దు అంటూ బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తన బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివ శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని అయితే వీరందరినీ తన అన్న జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని విషయాలు తెలిసే నివ్వరపోయారు.

వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు సిబిఐ విచారణ జరపాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వయిరీని అడ్డు కోవడంతో హత్య వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందని తెలిసి సునీత షాక్అయ్యారు. ఇలా జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య వెనక సూత్రధారి అనే విషయం తెలియడంతో తన సొంత జిల్లాలోనే ఆయనకు తన చెల్లెలు చుక్కలు చూపిస్తున్నారని ఆయనకు తన జిల్లాలోనే కష్టకరమవుతుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -