Sr Journalist Bharadwaj: చిరంజీవి గాడ్ ఫాదర్ అలా వస్తేనే ఘన విజయం సాధించినట్లు: భరద్వాజ్

Sr Journalist Bharadwaj: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయంకర్లేదు. టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గొప్ప నటుడుగా తనకంటూ చరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇక చిరంజీవి అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి తన సొంత టాలెంట్ తో చిరంజీవి టాలీవుడ్ లో హీరోగా హడావిడి చేస్తున్నాడు. ప్రస్తుతం అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇక చిరంజీవి ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను ఒక రేంజ్ లో మెప్పిస్తున్నాడు. ఇక త్వరలో విడుదల కాబోయే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ డ్రామా గా రూపొందించారు. మలయాళం లో ఘనవిజయం సాధించిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతారలు కీలకపాత్రలో పోషిస్తున్నారు.

కాగా సినిమా కు మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాను ఈ దసరాకి విడుదల చేయాలని సినీ బృందం అనుకున్నారు. ఇక ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా గురించి భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ఉంటే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఈ సినిమాను ప్రేక్షకులు మలయాళం లో ఆల్రెడీ చూసేసారని, అయినప్పటికీ సినిమా లో మార్పులు ఏ విధంగా చేశారని, మెగాస్టార్ నటన ఎలా ఉందని ప్రేక్షకులు వస్తారు.

ఆ సినిమా ఎలా ఉందనే క్యూరియాసిటీతో ప్రేక్షకుడి థియేటర్ కి వస్తాడు. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుడు పాజిటివ్ టోమ్ తో బయటకు రావాలి, అలా వస్తేనే సినిమా ఘన విజయం సాధిస్తుందని తెలిపాడు. ఇక ఇప్పటికే విడుదలైన తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందని. ఈ పాట ఎక్కడో ఆల్రెడీ విన్నట్లుగా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -