Sharmila: షర్మిల గురించి చెత్త పోస్ట్ లు పెట్టేవాళ్లకు భారీ షాక్ తప్పదా?

Sharmila: వైఎస్ సునీత, షర్మిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్య్యాఖ్యలు చేసిన అంశంలో తెలంగాణ పోలీసులు చర్యలకు రెడీ అవుతున్నారు. సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 509, 506 ఐపీసీతో పాటు 67 ఐటీ యాక్ట్ కింద కఠినమైన సెక్షన్లు చేర్చారు. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై సునీత ఫిర్యాదు చేశారు. తనపై, తన సోదరిపై సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. రవీందర్ రెడ్డి సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలించిన సైబర్ క్రైం పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. శుత్రుశేషం ఉండకూడదు. ఇద్దరిని లేపేయ్ అన్నాయ్.. ఎన్నికలకు పనికోస్తారని ఆయన అకౌంట్స్ లో పోస్టులను గమనించారు. దీంతో.. ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారు. ఏపీ గత చరిత్రను కూడా గుర్తు చేసుకొని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇద్దరి లేపేయ్ ఎన్నికలకు పనికొస్తాయ్ అనే పోస్టు ప్రభావం ఎంతో పోలీసులు అర్థం చేసుకున్నారు. దీంతో.. ఇవాళో రేపో రవీందర్ రెడ్డి అరెస్ట్ అవకాశం ఉంది.

 

ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే అర్థం వచ్చేలా విజయసాయిరెడ్డి కామెంట్స్ చేసిన కొద్ది గంటల్లో పోలీసులు సునీత ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నారు. అంటే, పరోక్షంగా ఏపీ రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓరకంగా చెప్పాలంటే.. సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ను వైసీపీ నేతలు కెలికిమరీ ఏపీ రాజకీయాల్లో తలదూర్చేలా చేశారు. ఇంత వరకూ ఏపీలో అసెంబ్లీ ఎన్నికల గురించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెద్దగా మాట్లాడింది లేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే.. పూర్తిగా తన ఫోకస్ సొంత రాష్ట్రంపైనే పెట్టారు. కానీ.. వైసీపీ నేతల తీరు రేవంత్ సైతం ఏపీ ఎన్నికల గురించి ఆలోచించేలా చేస్తుంది.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఎస్సార్ సీపీకి అన్ని రకాలుగా సాయం చేసింది. వైసీపీకి ఆర్ధికసాయం చేయడమే కాదు.. టీడీపీకి హైద్రాబాద్ నుంచి ఫండ్స్ కూడా రాకుండా అడ్డుకుంది. దీంతో.. జగన్ గెలుపు సులువైంది. అయితే… ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలంగాణ ప్రభుత్వం వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితుల మెండుగా ఉన్నాయి. ఇది టీడీపీకి పరోక్షంగా లాభం చేస్తుంది. అసలు వైసీపీ నేతలు సునీత, షర్మిలపై ఎక్కువ ఫోకస్ చేసి తప్పు చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని అంచనా వేసుకొని రియాక్ట్ అయితే బాగుంటుంది. ఏమాత్రం బలంలేని కాంగ్రెస్ పై ఫోకస్ చేసి అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అవి రాజకీయ విమర్శలు వరకూ ఉంటే పర్వాలేదు. కానీ, వ్యక్తిగత దూషణలకు పోవడం వలన అనివార్యంగా తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు వైసీపీ చాలా నష్టం జరుగుతుంది. గత ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ వలన టీడీపీ ఎంతమేరా నష్టపోయిందో అందరికీ తెలిసిందే. ఎన్నికలు ఏపీలో జరిగినా.. పోల్ మేనేజ్‌మెంట్ కి మూలాలు హైద్రాబాద్ లోనే ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహిస్తే జగన్ అండ్ కో కి చాలా మంచింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -