AP: ఏపీ ప్రజలకు అదిరిపోయే తీపికబురు.. ఏపీలో ఇక వానలే, వానలు.. భారీ వర్ష సూచన!

AP: ఏపీలో నెమ్మదిగా వాతావరణం లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో వర్షాలు పడాల్సింది పోయి విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. ఎండ వేడిగా తట్టుకోలేక జనాలు బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. దానికి తోడు కరెంటు కోతతో ఇంట్లో ఉండలేక ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్‌లో మోస్తరుగా, జూలైలో విస్తారంగా వానలు కురిశాయి. జులై చివరి వారంలో కూడా వానలు దంచికొట్టాయి. కానీ ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.

ఆగస్టులో వర్షాలు పడాల్సింది పోయి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే సెప్టెంబర్‌లో మాత్రం వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు. వచ్చే నెల మొదటి వారం నుంచి విస్తారంగా వానలు పడతాయట. ఆగస్టు నెల మొదటి వారం కాస్త వర్షాలు తగ్గుముఖం పడతాయని, ఆ తర్వాత మళ్లీ వానలు కురవాల్సింది పోయి ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉందంటున్నారు. వాస్తవానికి అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు వానలు పెద్దగా లేవు. ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా రుతుపవన ద్రోణి ప్రభావం ఏపీపై లేకుండా పోయింది అంటున్నారు. కానీ హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కుండపోత వానలు కురిశాయని అన్నారు. రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయాయి అంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టులో అక్కడక్కడా మినహా మిగిలిన చోట్ల వర్షాలు కురవలేదు. ఈ ద్రోణి ప్రభావం సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఏపీపై ఉంటుందంటున్నారు. ఆ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలవుతాయి అంటున్నారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి వానలు మొదలవుతాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌లో ఏపీ సాధారణం లేదా అంతకు మించి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ భావిస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -