Vijayasai Reddy: విజయసాయిరెడ్డిపై అసభ్య పదజాలం.. స్టాంగ్ కౌంటర్లు ఇస్తున్నారుగా!

Vijayasai Reddy: సమస్యలు ఎలా కొని తెచ్చుకోవాలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. ఆయనకు అవసరం లేని విషయాల్లో కూడా తలదూర్చి మాటలు పడటం ఆయనకు బాగా అలవాటు అయింది. రాజ్యసభలో విభజన హామీలు గురించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను నింధించారు. పదేళ్లుగా అధికారంలో లేని కాంగ్రెస్ ను నిందిస్తే ఏపీకి కావాల్సిన నిధులు వస్తాయా? అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నించాలి కదా? కానీ, బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసం కాంగ్రెస్ ను విమర్శించారు. సరే విజయసాయిరెడ్డి విమర్శలు ఏపీ వరకో లేదంటే.. అప్పటి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం వరకో పరిమితం అయితే పర్వాలేదు. కానీ, పరిధి దాటి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ను కూడా విమర్శించారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయాయని అన్నారు. పదేళ్ల వరకు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారని చెప్పారు. ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం కూడా తెలంగాణలో ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేమని.. రోజులు లెక్కబెట్టుకోవడమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

విజయసాయి రెడ్డి కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని సొంతపార్టీ నేతలే లోలోపల పెదవి విరుస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అంటే .. బీఆర్ఎస్, బీజేపీ తరుఫున వకాల్తా పుచ్చుకున్నట్టు ఉంటుందని తలలుపట్టుకుంటున్నారు. అసలు మాట్లాడేటప్పుడు విచక్షణ కోల్పోతే ఎలా అని విజయసాయి రెడ్డిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అని ఆందోళన వ్యక్తచేస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు మనీ మేనేజ్‌మెంట్ హైద్రాబాద్ లోనే జరుగుతుంది. ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు విజయసాయి రెడ్డి. పైగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఎన్నికల్లో ఏమైనా ఇబ్బందులు కలగొచ్చని వైసీపీ నేతలు భయపడుతున్నారు. అయితే, వైసీపీ నేతలు బయపడినట్టే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడా? లేకపోలే బీజేపీ బ్రోకరా అని తీవ్రస్థాయిలో జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ డైరెక్షన్ లో వైసీపీ, కేసీఆర్ పని చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టే.. కాంగ్రెస్ కూలిపోతుందని వైసీపీ కూడా చెప్పడం తమకు అనుమానంగా ఉందని అన్నారు. వీరంతా కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, ఇలాంటి బెదిరింపుకలు తాము బయపడమని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొడతామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు ఈ మూడు పార్టీలకు బుద్ధి చెబుతామని జగ్గారెడ్డి హెచ్చరించారు. అటు, మరో నేత అద్దంకి దయాకర్ కూడా విజయసాయి రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి జ్ఞానం ఎక్కుడుందో అర్థం అవుతోందని అన్నారు. షర్మిల ఏపీకి వచ్చి ప్రత్యేక హోదా తీసుకొని వస్తానంటే వైసీపీకి ఎందుకు నొప్పి అని ప్రశ్నించారు. ఏపీ ఆర్థికంగా బలపడటం వైసీపీ నేతలకు ఇష్టం లేదని విమర్శించారు. వైసీపీ ఎలా బుద్ది చెప్పాలో తమకు తెలుసని దయాకర్ అన్నారు. అంతే కాదు.. కాంగ్రెస్ సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో.. అవసరం లేని దగ్గర సంబంధం లేని దగ్గర ఎందుకు తలదూర్చడమని వైసీపీ నేతలే లోలోపల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -