Acham Naidu: అచ్చెన్న కామెడీ మామూలుగా లేదుగా.. ఈ మాత్రం తెలివి కూడా లేదా?

Acham Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని విమర్శిస్తూ అచ్చం నాయుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ మాటలకి రీకౌంటర్ లు స్టార్ట్ చేశారు వైఎస్సార్ మిత్రపక్షం వాళ్ళు. ఇంతకీ అచ్చం నాయుడు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి..

ఎన్నికలు త్వరగా వచ్చేలా చూడాలని పెద్దల కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో జగన్ పాలన పట్ల అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయన్నారు జగన్ సొంత వర్గంలోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు.

 

వచ్చే ఎన్నికలలో కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు అచ్చం నాయుడు. అలాగే సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో ముంచేసారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకి స్ట్రాంగ్ రీకౌంటింగ్ ఇస్తున్నారు వైసీపీ నేతలు.

 

ఒళ్ళు పెంచుకుంటే సరిపోదని కాస్త బుర్ర పెంచుకోవాలని అచ్చం నాయుడుకి అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ ఓ సందర్భంలో హితువు చెప్పారు అది ఊరికే చెప్పలేదని ఇప్పుడు అర్థమవుతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒకవైపు ముందస్తు ఎన్నికల విషయమై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

 

మోడీ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు అలాంటి సందర్భంలో ఎందుకు జగన్ మోడీ కాళ్లు పట్టుకొని ముందస్తు ఎన్నికల కోసం బ్రతిమాలు కుంటారు.

 

ఏదో ఒకటి విమర్శించాలని ఉద్దేశంతో నోటికి వచ్చినట్లు మాట్లాడటం అచ్చెన్నకు అలవాటు అయిపోయింది అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. నిజంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ అనుకుంటే మోడీ సర్కార్ని బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదనే తెలివి అచ్చెన్నకు.. కరువైందని.. అసెంబ్లీని రద్దు చేస్తే ఆటోమేటిక్గా ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుందనే జ్ఞానం కూడా అచ్చం నాయుడు కి లేకపోవడం విచారకరం అంటూ ఎద్దేవా చేస్తున్నారు జగన్ వర్గీయులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -