Bandla Ganesh: టీవీ ఛానల్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసిన బండ్లన్న?

Bandla Ganesh: బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు ఈయన నటుడుగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇకపోతే బండ్ల గణేష్ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకపోయినా ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు.

బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన ఆ పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున మరో వివాదానికి దారి తీస్తూ ఉంటాయి. ఇలా ఒక వివాదం మర్చిపోకముందే మరో వివాదానికి తెర లేపుతూ నిత్యం వార్తల్లో ఉండే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో బిజీగా ఉండటమే కాకుండా ఈయన షాద్ నగర్ లో కోళ్ల ఫారం బిజినెస్ కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈయన మరొక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా మా టీవీ వార్షికోత్సవం సందర్భంగా బండ్ల గణేష్ మాటీవీ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈట్వీట్ పై స్పందిస్తూ… మీరు కూడా ఒక ఛానల్ ప్లాన్ చేయొచ్చు కదా అన్న అంటూ ట్వీట్ చేశారు.ఇలా నేటిజన్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ స్పందిస్తూ అదే ప్లానింగ్ లో ఉన్నాను బ్రో అంటూ ఈయన ప్లాన్ మొత్తం బయటపెట్టారు. ఇలా బండ్ల గణేష్ స్వయంగా టీవీ ఛానల్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని వెల్లడించారు.

ఈ విధంగా బండ్ల గణేష్ టీవీ ఛానల్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈయన ఒకవేళ టీవీ ఛానల్ ప్రారంభించిన ఏ పార్టీ తరపున ఛానల్ ప్రారంభిస్తారు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.ఒకవేళ ఈయన టీవీ ఛానల్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ట్ చేస్తారా లేదా తెలంగాణ పార్టీ తరఫున స్టార్ట్ చేస్తారా లేకపోతే సరికొత్తగా మరొక ఛానల్ ప్లాన్ చేస్తారా అనే విషయం గురించి చర్చలు మొదలవుతున్నాయి. ఇక బండ్ల గణేష్ ఆలోచన చూస్తుంటే మాత్రం ఈయన వచ్చే ఎన్నికలలోగా టీవీ ఛానల్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే ఈ విషయంపై బండ్ల గణేష్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -