Nandamuri Mokshagna: మళ్లీ తెరపైకి వచ్చిన అదే లొల్లి.. అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు!

Nandamuri Mokshagna: ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్నటువంటి వారందరి వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటిస్తూ స్టార్ సెలబ్రిటీలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే అతనిపై ఆశలు కూడా వదులుకున్నారు. అదిగో మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇలా ఈయన ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసి చివరికి అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ తన కుమారుడిని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఆయన కుమారుడికి మాత్రం సినిమాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని అభిమానులు భావిస్తున్నారు. మోక్షజ్ఞ హీరో కటౌట్ కాదని కొందరు భావిస్తుండగా ఆయన మాత్రం పూర్తిగా తన శరీరంపై దృష్టి పెట్టి హీరో అవుట్ ఫిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

అయితే గత కొద్ది రోజుల క్రితం ఏదో కార్యక్రమంలో భాగంగా కనిపించిన మోక్షజ్ఞ ఏమాత్రం తనలో మార్పు రాలేదని ఎప్పటిలాగే అధిక శరీర బరువుతో ఉన్నారని అభిమానులు ఆయన లుక్ చూసి ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికీ తన లుక్ పరంగా ఏమాత్రం మార్పు రాకపోవడంతో అభిమానులు ఈయన ఎంట్రీ పై ఆశలు వదిలిపెట్టుకుంటున్న తరుణంలో మరోసారి ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త తెరపైకి వస్తోంది.

గత కొద్ది రోజుల క్రితం స్వయంగా బాలకృష్ణ తన కొడుకు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రకటించడంతో ఏ డైరెక్టర్ తనని ఇండస్ట్రీకి లాంగ్ చేయబోతున్నారని అభిమానులు ఆరా తీస్తున్నారు.మోక్షజ్ఞను లాంచ్ చేసే డైరెక్టర్ ఎవరు అనే క్లారిటీ లేకపోయినప్పటికీ ఈయన వెండితెర ఎంట్రీకి అన్ని సిద్ధమయ్యాయని వార్తలు రావడంతో అభిమానులు ఎప్పటిలాగే ఈ వార్తలలో కూడా ఏమాత్రం నిజం ఉండదని భావిస్తున్నారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి చూసి చివరికి విసగు చెందారని తెలుస్తోంది. అయితే ఈయన ఎంట్రీ ఎప్పుడు ఎవరితో ఉంటుందో అధికారకంగా ప్రకటిస్తే తప్ప తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -