Alla Ramakrishna Reddy: ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటు అంబటికి షాక్.. జగన్ సర్కార్ షాకింగ్ నిర్ణయం ఇదేనా?

Alla Ramakrishna Reddy: ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీ నేతలు ఎన్నికలపై దృష్టి సారించారు అయితే గత నెల రోజుల క్రితం వైఎస్ఆర్సిపి పార్టీకి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ పంచన చేరడంతో మంగళగిరిలో లోకేష్ విజయం ఖాయమని అందరూ భావించారు. ఇలా పార్టీ వీడి పక్క పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి సొంతగూటికి రప్పించారు. ఈ క్రమంలోని నిన్న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈయన తిరిగి పార్టీలో చేరారు.

ఆర్కే సొంత గుడికి చేరడంతో ఈసారి జరగబోయే ఎన్నికలలో ఆర్కేకి తప్పనిసరిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఖాయమని అందరూ భావిస్తున్నారు. అయితే ఈయన పార్టీలోకి తిరిగి రావడంతో అంబంటి ఎమ్మెల్యే పదవికి షాక్ తగిలిందని తెలుస్తోంది. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గానికి ఇన్చార్జిగా చిరంజీవి గంజి వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈయనే మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఆర్కేను మాత్రం సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబును ఈయనని మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -