Allu Arjun-Sneha: హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భార్యకు ప్రేమతో బన్నీ చేసిన పోస్ట్ చూస్తే షాకవ్వాల్సిందే!

Allu Arjun-Sneha: అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఈమెకు ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం లేకపోలేదు హీరోయిన్స్ తరహా లోనే స్టైలిష్ ఫోటో షూట్లను చేయిస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా నిత్యం తన కుటుంబానికి తన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఇక అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈ దంపతులు లండన్ లో ఈ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారని చెప్పాలి. ఇక స్నేహ రెడ్డి పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ తనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ కలిసి దిగిన ఫోటోని ఈయన షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే క్యూటీ అంటూ చాలా క్యూట్ గా తన భార్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తానే తన జీవితానికి వెలుగు అనే అర్థం వచ్చేలా ఈయన చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అదేవిధంగా స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ క్రిష్ చిన్న సర్ప్రైజ్ కూడా ఇచ్చారు..

అల్లు అర్జున్ సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన రెడ్ బస్ యాప్ నుప్రమోట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటివరకు తెలుగులో ఈ సంస్థను ప్రమోట్ చేస్తున్నటువంటి అల్లు అర్జున్ ఇకపై బాలీవుడ్ లో కూడా ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇందుకు సంబంధించిన యాడ్ షూట్ డైరెక్టర్ క్రిష్ చేశారు. స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోని కూడా రిలీజ్ చేయడంతో అభిమానులు ఎంతోసంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -