Allu Arjun: అల్లు అర్జున్ జీవితంలో పనికిరాడని డబ్బులు ఇచ్చిన రామలింగయ్య?

Allu Arjun:  తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్.. ఇటీవల విడుదలైన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ తాతగారు అయినటువంటి హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి పురస్కరించుకొని అల్లు రామలింగయ్య పుస్తక ఆవిష్కరణ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అతిథిగా విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ నాకు 16 సంవత్సరాలు వచ్చేవరకు మా తాతయ్య నానమ్మల దగ్గర పెరిగాను.

మా తాతయ్య చనిపోయాక 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు నాకు వచ్చింది. ఆయన ఇలా ఎందుకు చేశారని బీమా కట్టిన సంవత్సరాన్ని చూసాను. తాతయ్య డబ్బు జమ చేయడం మొదలుపెట్టినప్పుడు నేను నాలుగవ తరగతి చదువుతున్నాను. వీడి జీవితంలో ఎందుకీ పనికిరాడు అని అనుకున్నాడట. కనుక వీడికి 18 సంవత్సరాలు వచ్చినప్పుడు 10 లక్షల రూపాయలు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని అల్లు అర్జున్ తాత భావించాడట. కనుక ఆ డబ్బులు జమ చేశాడట.

అలా ఆయన దృష్టిలో ఎందుకు పనికిరాని నేను.. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఆయన కూడా నా ఎదుగుదలని చూసి ఉంటే బాగుండేది అని అల్లు అర్జున్ తెలిపారు. ఏదేమైనా అల్లు అర్జున్ ప్రస్తుతం తనకంటూ నటనలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక చేతినిండా వరుస ఆఫర్లతో టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుత అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పార్ట్ 2 తో అల్లు అర్జున్ ప్రేక్షకుల ఏవిధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -