Allu family: బన్నీ భార్య పని వల్ల అల్లు ఫ్యామిలీ పరువు పోతుందా?

Allu family: ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి బొలెడు మంది హీరోయిన్లు ఉన్నారు. అలాగే ఇండస్ట్రీలో రాణించడానికి చాలా మంది యువ హీరోయిన్లు పోటీ పడుతున్నారు. సినిమాలో హిట్ కొట్టినా.. హిట్ కొట్టకపోయినా.. సోషల్ మీడియాలో తమ అందాలను ఆరబోస్తూ కుర్రకారును చెమటలు పట్టిస్తున్నారు. ఈ క్రమంలో మేము కూడా అందంగా ఉన్నాం.. హీరోయిన్‌గా మేము రాణిస్తామని సీనియర్ హీరోల డాటర్లు, స్టార్ హీరోల భార్యలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీ డాటర్లు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌తోపాటు ఇతర సినీ ఇండస్ట్రీలోనూ అవకాశాలు రాబట్టుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

 

అల్లు స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టార్ హీరోయిన్లకు ధీటుగా ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకుంది. అయితే గత కొద్ది రోజులుగా స్నేహారెడ్డి హీరోయిన్‌గా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమెపై కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన స్నేహారెడ్డి.. హీరోయిన్‌గా చేయడం ఏంటనీ అల్లు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం అందులో తప్పేంటని చెబుతున్నారు. హీరోయిన్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు స్నేహారెడ్డికి ఉన్నాయని, ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదని.. ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే నడుస్తోంది. ఈ క్రమంలో బన్నీ కూడా భార్య ఇష్టాన్ని గౌరవించి సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సినిమాలో స్నేహారెడ్డి కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్నేహారెడ్డి ట్రెడిషనల్‌ లుక్‌లో అదిపోతారని, ఆమె పాత్ర కూడా కీలకంగా మారబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో స్నేహారెడ్డిని వెండితెరపై చూసేందుకు అల్లు ఫ్యాన్స్ ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -