Alluarjun: బన్నీ పరువు తీసేసిన సీనియర్ నటి.. ఏమైందంటే?

Alluarjun: తెలుగు సినిమా స్టామినా అంతకంతకు పెరుగుతోంది. అయితే తెలుగు సినిమా క్రేజ్ ను నార్త్ లో విపరీతంగా పెంచేసిన సినిమా మాత్రం ‘పుష్ప’. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు భయంకరమైన క్రేజ్ రావడంతో పాటు తెలుగులో కూడా సినిమాలో ఎంతో అద్భుతంగా ఉంటాయని హిందీ ప్రేక్షకులు అనుకునేలా చేసింది.

 

‘తగ్గేదేలే’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ బాలీవుడ్ నే కాదు, క్రికెట్ ను కూడా ఎలా ఊపేసిందో అందరం చూశాం. అలాంటి ఎన్నో డైలాగులను కలిగి ఉన్న అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా విపరీతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా కాకపోయినా హిందీలో భారీగా కలెక్షన్లు వచ్చాయి.

 

తెలుగు ప్రేక్షకులు అయితే ‘పుష్ప’ సినిమాతో పండగ చేసుకోగా.. ప్రతి ఒక్కరికి ఆ సినిమా ఫీవర్ చాలా రోజుల వరకు ఉండింది. అయితే తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం అల్లు అర్జున్ ఎవరో తనకు తెలియదు అని చెప్పడం అల్లు ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. ఇంత పెద్ద స్టార్ హీరో తెలియకపోవడం ఏంటి అని అల్లు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

తాజాగా అలీ చేస్తున్న ‘అలీతో సరదాగా’షోకి సీనియర్ హీరోయిన్ ఎల్ విజయలక్ష్మి వచ్చారు. ఈమధ్యన ఏ సినిమా చూశారని అలీ ప్రశ్నించగా.. ఆమె ‘పుష్ప’ అని సమాధానం ఇచ్చింది. దీంతో అందులో హీరో ఎవరో తెలుసా? అని ప్రశ్నించాడు. ఆమె దానికి బదులిస్తూ.. ‘అతను ఎవరో నాకు తెలియదు కానీ బాగా నటించాడు’ అని చెప్పింది. అలీ..‘అతను ఎవరో కాదు, అల్లు రామలింగయ్య మనవడు’ అని చెప్పాడు. అయితే సీరియర్ నటి ఇలా అల్లు అర్జున్ ఎవరో తెలియదు అన్నట్లు మాట్లాడటంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -