IT Employee: ఇల్లు అద్దెకు ఇస్తే గుల్ల చేసిన ఐటీ ఉద్యోగి.. ఏం జరిగిందంటే?

IT Employee: పట్టణాలలో అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఇల్లు అద్దెకు దొరకడం చాలా కష్టం ఒకవేళ దొరికిన అద్దె భారీగా ఉంటుంది. ఇల్లు అద్దెకి ఇవ్వబడును అనే బోర్డు కనుక చూసి అక్కడికి వెళ్లామంటే కింద రూల్స్ భారీగానే ఉంటాయి.ఇలా రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే ఇల్లు అద్దెకి ఇస్తారు అది కూడా ముందుగా అడ్వాన్స్ చెల్లించి డిపాజిట్ కూడా చెల్లిస్తేనే ఇంటిని మనకు అద్దెకు ఇస్తారు. అయితే తాజాగా బెంగళూరుకి చెందిన ఓ ఐటి ఉద్యోగికి ఇల్లు అద్దెకు ఇచ్చారు.

ఇలా బెంగళూరులో ఇంట్లో అద్దెకు ఉన్నటువంటి ఓ ఉద్యోగి డిపాజిట్ కూడా చెల్లించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన కొంతకాలంగా ఇంటికి రావడం లేదు అయితే ఉద్యోగి ఇంటి యజమానికి ఫోన్ చేసి తాను ఇల్లు ఖాళీ చేస్తానని తను చెల్లించిన డిపాజిట్ మొత్తం తనకు వెనక్కి తిరిగి ఇవ్వాలని యజమానికి ఫోన్ చేసి చెప్పారు. ఇక యజమాని ఇల్లు ఖాళీ చేస్తేనే తనకు డిపాజిట్ కూడా తిరిగి వెనక్కి ఇస్తానని చెప్పారు.

 

ఇలా ఆ ఉద్యోగి ఎన్ని రోజులకు ఇల్లు ఖాళీ చేయడానికి రాకపోవడంతో ఇంటి ఓనర్ కు అనుమానం వచ్చింది. ఇలా అనుమానం రాగ తన దగ్గర ఉన్నటువంటి మరొక కీ తీసుకొని ఇంటి తలుపులు తెరిచారు. ఇలా ఇంటి తలుపులు తెరిచి చూసిన ఆ ఓనర్ కి ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. ఇల్లు మొత్తం ఎక్కడ చూసినా మందు సీసాలు దర్శనం ఇచ్చాయి. ఇది ఇలా లేక బారా అనే విధంగా ఇంట్లో మందు సీసాలు పడి ఉన్నాయి.

 

ఇల్లు మొత్తం చండాలంగా పాడు చేయడమే కాకుండా ఇంట్లో పావురాలు కూడా తిరుగుతున్నాయి. ఇలా ఇంటిని మొత్తం పాడు చేసే ఆ ఉద్యోగి తన డిపాజిట్ తనకి ఇవ్వాలంటూ ఫోన్ చేయడంతో ఒక్కసారిగా ఆ ఓనర్ ఆశ్చర్యపోయారు.ఇలా ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందుకే బ్యాచిలర్స్ కు ఇల్లు అద్దెకు ఇవ్వకూడదు అనేది అంటూ ఆ ఫోటోలను షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలపై స్పందించిన కొందరు ఆయనకు డిపాజిట్ వెనక్కి ఇవ్వకుండా ఆ డబ్బుతో ఇల్లు క్లీన్ చేయించండి అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -