YS Sharmila: తెలంగాణ బిడ్డ అని చెప్పుకుని ఆంధ్ర ప్రదేశ్ కి ఎలా వస్తుంది…

YS Sharmila: వైయస్ షర్మిల తాజాగా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో వీలీనం చేసి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలాకి కీలక బాధ్యతలు ఇవ్వాలని యోచిస్తుంది.దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులలో అసంతృప్తి వెలుగు చూస్తుంది. తాజాగా మాజీ ఎంపీ హర్ష కుమార్ షర్మిల పైన కీలక వ్యాఖ్యలు చేశారు.

 

అంధ్రప్రదేశ్‌లో త్వరలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. రాష్ట్ర విభజన వల్ల ఉన్న వ్యతిరేకతతో 2014, 2019లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక 2024 ఎన్నికల్లో అయిన తిరిగి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. మొన్న జరిగిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్బంగా కాంగ్రెస్ మరింత ఉత్సాహంతో పని చేస్తోంది. ఎలాగైనా సరే ఆంధ్ర ప్రదేశ్లో తిరిగి బాగా వేయాలని ప్రయత్నిస్తూ ఆ మేరకు ప్రణాళికలో రచిస్తూ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే షర్మిలకు కీలక బాధ్యతలు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తుంది.ఇప్పుడు మాజీ ఎంపీ హర్ష కుమార్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు ఇస్తే ఇప్పటి వరకు చేసింది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అని అన్నారు.కావాలంటే కేంద్రంలో కీలక పదవి ఇవ్వండి అని చెప్పారు. షర్మిల మొన్నటి వరకు తెలంగాణలో తిరిగి తెలంగాణ బిడ్డ అని చెప్పుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఎలా రాజకీయం చేస్తారు అంటూ ప్రశ్నించారు.కుమారుడి పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లి జగన్ మోహన్ రెడ్డితో అరగంట మంతనాలు చెయ్యాల్సిన పని ఏం ఉంది అని అడిగారు.సీఎం జగన్ బిజెపి తో టచ్ లో ఉంటారు.ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరారు.రేపు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చిన ఇద్దరు కలిసి తమ పబ్బం గడుపుకోవచ్చు అని చూస్తున్నారు అని అన్నారు. షర్మిల జగన్ ఇద్దరు ఒకే గూటికి చెందిన పక్షులు వాళ్ళని నమ్మడానికి వీల్లేదని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -