NTR-Anirudh: ఎన్టీఆర్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన అనిరుధ్.. దేవరకు భారీ ఝలక్ తప్పదా?

NTR-Anirudh: తెలుగు ప్రేక్షకులకు అనిరుధ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాలకు మంచి మంచి పాటలను అందించి మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఇది ఇలా ఉంటే అనిరుధ్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఎటువంటి పాటలు పాడలేదన్న విషయం తెలిసిందే. తర్వాత చాలా సినిమాలకు దర్శకనిర్మాతలు అనిరుధ్‌ని ప‌ట్టుకురావాల‌ని చాలామంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నించారు. కానీ కుద‌ర్లేదు. మ‌హేష్ త్రివిక్ర‌మ్ సినిమాకి మొద‌టి ఆప్ష‌న్ త‌నే. ఖుషి సినిమా కోసం శివ నిర్వాణ అనిరుధ్‌ని తీసుకురావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు.

కానీ త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు ఎట్ట‌కేల‌కు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవ‌ర‌ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా అనిరుధ్ ఫిక్స‌య్యాడు. పోస్ట‌ర్‌ పై అనిరుధ్ పేరు క‌నిపిస్తోంది కానీ, కొర‌టాల‌కు త‌ను ట‌చ్‌లో లేకుండా పోయాడ‌ట‌. మ్యూజిక్ సిట్టింగ్స్‌కి అనిరుధ్ స‌మ‌యం ఇవ్వ‌లేక‌పోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీలో ఒక వార్త జోరుగా వినిపిస్తోంది. నిజానికి షూటింగ్ మొద‌లెట్ట‌క‌ముందే ట్యూన్స్ ఫైన‌లైజ్ చేసుకోవాలి. కానీ అనిరుధ్ బిజీ షెడ్యూల్ వ‌ల్ల అది జ‌ర‌గ‌లేదు.

 

కొర‌టాల ప్ర‌స్తుతం యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ షెడ్యూల్ అయిన త‌ర‌వాతే టాకీ మొద‌ల‌వుతుంది. మ‌ధ్య‌లో కాస్త బ్రేక్ వ‌స్తుంది. ఈ స‌మ‌యంలో అనిరుధ్ తో సిట్టింగ్ వేయాల‌ని చూస్తున్నాడట. కానీ అనిరుధ్ త‌న సినిమాల‌తో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. ఎందుకో అనిరుధ్‌కి తెలుగు సినిమాల‌పై పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ ఉండ‌ద‌ని, అందుకే తెలుగు ఆఫ‌ర్ల‌ని వ‌దులుకొంటాడ‌ని వార్తలు ఇప్పటికే చాలా సందర్భాలలో వినిపించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సినిమానీ అనిరుధ్ లైట్ గా తీసుకొన్నాడ‌ని చెప్పుకొంటున్నారు. కొర‌టాల శివ మాత్రం త‌న క‌థ‌కు అనిరుధ్ క‌రెక్ట్ ఆప్ష‌న్ అని ఇప్ప‌టికీ న‌మ్ముతున్నాడు. అందుకే ఆల‌స్య‌మైనా స‌రే, త‌న పిలుపు కోసం ఎదురు చూస్తున్న‌ట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర దర్శక నిర్మాతలకు మాదిరిగానే ఎన్టీఆర్ కు కూడా అనిరుద్ ఝలక్ ఇవ్వనున్నాడా సినిమా నుంచి తప్పుకోనున్నాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -