Ap Farmers: ఏపీ రైతులకు మరో అదనపు భారం.. ఏం జరిగిందంటే?

Ap Farmers: ఏపీలో విద్యుత్ సరఫరా పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యుత్ సరఫరా విషయంలో ఏపీ ప్రజలు తలలు బాదుకుంటున్నారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోయినా కూడా బిల్లులు మాత్రం మోగుతున్నాయి. కరెంటు లేకపోయినా కూడా ఒక్కొక్క ఇంటికి రూ. 400 నుంచి రూ.800 వరకు బిల్ లు వస్తున్నాయి. ప్రజలు కరెంటు వాడింది కొంత అయితే, దానికి రకరకాల పేర్లతో ఛార్జీలు జోడించి భారీగా బిల్లులు చేతిలో పెడుతున్నారు. దీంతో అంతంత బిల్లులో కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు.


ఇప్పటికే అన్ని రేట్లు పెరిగిపోయాయని ప్రజలు గుండెల బాధకుంటున్న ఏపీ ప్రజలకు దానికి తోడు కరెంటు బిల్ కూడా పెరిగిపోవడంతో చాలామంది ఏపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. కాగా ఇప్పుడు ఏపీలో రైతులు, ఆక్వా రైతులు, ఇంకా విద్యుత్‌ రాయితీలు పొందుతున్న కులవృత్తుల వారందరిపై మరోసారి భారీగా బిల్లులు వడ్డింపు అనివార్యంగా కనిపిస్తోంది. ఆర్ధిక సమస్యలతో కటకటలాడుతున్న వైసీపీ ప్రభుత్వం, విద్యుత్‌ సంస్కరణలు అమలుచేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పుల కోసం ఆశపడటమే దీనికి కారణం. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు అంగీకరించి 2021-22, 2022-23లో కలిపి మొత్తం రూ.9,574 కోట్లు అప్పులు తెచ్చుకొంది.

 

మళ్ళీ 2023-24లో మరో రూ.7,000 కోట్లు అప్పు తెచ్చుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఈ అప్పుల భారం ఎలాగూ రాష్ట్ర ప్రజలే మోయాలి. ఇది కాక విద్యుత్ సంస్కరణల పేరుతో పెట్టబోయే స్మార్ట్ మీటర్స్ అదనపు భారంతో పాటు త్వరలో ప్రవేశపెట్టబోయే ప్రీపెయిడ్ బిల్ పేమెంట్ సిస్టమ్‌లో అవకతవకలు లేదా లోపాలకు కూడా ప్రజలే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇంతవరకు వ్యవసాయానికి రాయితీతో విద్యుత్ సరఫరా అవుతోంది కానీ ఇకపై వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్స్ బిగిస్తే, ముందుగా రైతులే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఆ రాయితీ సొమ్మును ప్రభుత్వం వారి ఖాతాలలో జమా చేస్తుంది. ఉద్యోగుల జీతాల చెల్లింపుకే ఇబ్బంది పడుతున్న వైసీపీ ప్రభుత్వం, రైతులు చెల్లించిన విద్యుత్ బిల్లులు వెంటవెంటనే చెల్లిస్తోందనుకోవడం అవివేకం అత్యాసే అవుతుంది కదా? స్మార్ట్ మీటర్స్ ద్వారా విద్యుత్ వినియోగం లెక్కించి బిల్లులు చెల్లించడం ఒక్క వ్యవసాయ రంగానికే పరిమితం కాదు. విద్యుత్ రాయితీ పొందుతున్న అందరికీ వర్తిస్తుంది. పైగా ఈ విద్యుత్ సంస్కరణల అమలును అంటే విద్యుత్ సరఫరా, వినియోగం, చెల్లింపులు, రాయితీలు అన్నిటినీ కేంద్రప్రభుత్వం పర్యవేక్షిస్తుంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వివరాలను దాచిపెట్టడానికి సాధ్యం కాదు. వంట గ్యాస్ సబ్సీడీని ఎత్తివేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా ఇదే విధానాన్ని అమలుచేశాయి. కనుక రాబోయే రోజుల్లో ఉచిత లేదా రాయితీ విద్యుత్ పూర్తిగా ఎత్తివేయడమే కాక ఎప్పటికప్పుడు బాదుడు కూడా భరించాల్సి ఉంటుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -