TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై మరో కేసు

TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులు స్వామిలపై మరో కేసు నమోదు అయింది. తాండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో ముగ్గురు నిందితులపై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నకిలీ గుర్తింపు పత్రాలను సృష్టించినట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

 

 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో దర్యాప్తును విధించి స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చి కొద్దిసేపట్లోనే ముగ్గురు నిందితులపై మరో కేసు నమోదు కావడం విశేషం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుతో సంబంధం లేకుండా ఈ కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారంటూ పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుతో సంబంధం లేకుండా నకిలీ పత్రాలను సృష్టించారనే ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీసులు ఆ ముగ్గురు నిందితులు ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేశారు.

 

 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుపై ఇవాళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని, ఈ కేసులో పోలీసులు ముందకు వెళ్లవచ్చని సూచించింది. ఎక్కువ రోజులు దర్యాప్తును నిలిపివేయడం మంచిదికాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యలను ప్రలోభాలకు గురి చేశారనే కారణంతో గత నెలలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. చర్లపల్లి జైల్లో ముగ్గురు నిందితులు ఉన్నారు. కానీ ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్ ను హైకోర్టు పెండింగ్ లో పెట్టింది.దానిపై విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. ప్రస్తుతాినికి దర్యాప్తుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో పోలీసులు స్పీడ్ పెంచనున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -