KCR: మొండి పట్టు పడుతున్న కేసీఆర్.. ఆ పని చెయ్యనంటూ?

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం ప్ర‌తిపాదించిన‌ విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేసేది లేద‌ని ఆయ‌న తెగేసి చెప్పారా? అంటే అవును అనే అంటున్నారు తెలంగాణ అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు ఇచ్చే ఇన్సెంటివ్స్‌కు సంస్క‌ర‌ణ‌ల‌కు ముడి పెట్టిన విష‌యం తెలిసిందే. వివిధ రూపాల్లో తెచ్చిన సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేస్తే,అద‌నంగా రుణాల, నిధులు ఇచ్చి ప్రోత్స‌హిస్తామ‌ని గ‌త రెండేళ్లుగా చెబుతున్నారు. అయితే గ‌తంలో ఒక‌సారి తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు ఇదే విష‌యాన్ని తెలిపారు.

 

రైతులు వాడే విద్యుత్‌కు మీట‌ర్లు పెట్టాల‌ని కేంద్రం చెప్పింద‌ని ఇలా పెడితే 4 వేల కోట్ల రూపాయ‌లు ఇన్సెంటివ్‌గా ఇస్తామ‌ని, కానీ, రైతుల ప్ర‌యోజ‌నాలు కాపాడాల‌నే ఉద్దేశంతో కేసీఆర్ ఈ ప్ర‌తిపాద‌న‌కు ఒప్పుకోలేద‌ని హరీష్ రావు వెల్లడించారు. కాగా అదే స‌మయంలో ఏపీ ప్ర‌భుత్వం 4 వేల కోట్ల‌కు క‌క్కుర్తి ప‌డి అక్క‌డి రైతుల మెడ‌ల‌కు విద్యుత్ మీట‌ర్ల ఉచ్చు బిగించింద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన విషయం తెలిసిందే. దీంత అప్ప‌ట్లో ఈ విషయం దుమారం రేపింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మ‌రోసారి విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల అంశం తెర‌మీదికి వ‌చ్చింది.

తాజాగా ఏపీ ప్ర‌భుత్వం కేంద్రం ప్ర‌తిపాదించిన విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌కు ఓకే చెప్పింది. ఫ‌లితంగా 0.5 శాతం చొప్పున జీఎస్‌డీపీలో కేంద్రం నుంచి ఇన్సెంటివ్‌ను తెచ్చుకోనుంది. కానీ, ఇదే స‌మ‌యంలో తెలంగాణ దీనిని వ‌దులుకుంది. కాగా ఏపీలో రైతులు, బడుగు, బలహీనవర్గాలు, ఆక్వా రైతులు, చిన్నాచితకా పరిశ్రమలకు విద్యుత్ సంస్కరణలు అమ‌లు చేయాల‌ని కేంద్రం భావిస్తోంది. 2021-22, 2022-23లో సంస్కరణల అమలు పేరుతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రూ.9,574 కోట్ల మేర‌కు అప్పులు తెచ్చుకుంది. తాజాగా మరో రూ.7,000 కోట్ల అప్పు తెచ్చుకునే అవకాశం వైసీపీ సర్కారుకు లభించింది.

కేంద్రం కొత్తగా మూడు సంస్క‌ర‌ణ‌లు ప్ర‌తిపాదించింది. వాటిని అమలుచేస్తే విద్యుత వినియోగదారులపై మరింత భారం త‌ప్ప‌దు.

అయినా కూడా సంస్క‌ర‌ణ‌ల‌కు జై కొట్టిన రాష్ట్రాలకు వాటి జీఎస్‌డీపీలో 0.5 శాతం అదనపు అప్పులకు కేంద్రం అవకాశం కల్పిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -