YS Sharmila: షర్మిల ఇంటి దగ్గర మళ్లీ గొడవ.. ఇలా చేయడం కరెక్టేనా?

YS Sharmila: హైదరాబాద్ లోట‌స్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఇంటి వ‌ద్ద మ‌రోసారి గొడ‌వ‌కు దారి తీసింది.లోటస్ పాండులోని తన నివాసం నుంచి షర్మిల కారులో బయటకు ప్రయాణం చేస్తుండగా వెంటనే పోలీసులు తన కారును ముందుకు కదలినివ్వకుండా అడ్డుకున్నారు.ఈమె బయటకు వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల కారును ముందుకు పోనీచ్చే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు తన కారు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా డ్రైవర్ ను కిందికి లాగేసారు.

ఈ విధంగా పోలీసులు డ్రైవర్ పట్ల వ్యవహరించిన తీరుపై మండిపడిన షర్మిల వెంటనే అసలు తనని ఎందుకు అడ్డుకున్నారు అంటూ ఈమె ప్రశ్నించారు. అయితే పోలీసుల నుంచి షర్మిల ప్రశ్నకు సరైన సమాధానం లేకపోయినప్పటికీ ఆమెను మాత్రం పోలీసులు కదలకుండా గట్టిగా పట్టుకోవడంతో ఆమె పోలీసులను నెట్టేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఇక తనని ఎందుకు వెళ్ళనివ్వడం లేదో అంటూ పోలీసులను ప్రశ్నించారు.

ఇలా షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం పోలీసుల వద్ద నుంచి బయటకు రాకపోయినా ఆమె పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా ఈమెను ఎందుకు అరెస్టు చేశారనే విషయం మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇక పోలీసులు ఈమె పాదయాత్రను కూడా అడ్డుకున్న విషయం మనకు తెలిసిందే. షర్మిల పాదయాత్ర చేస్తూ అధికార నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

నిరుద్యోగుల కోసం షర్మిల పోరాటం చేస్తున్న నేపథ్యంలో తన పాదయాత్రకు ఏ విధమైనటువంటి అనుమతి ఇవ్వకూడదని పోలీసులను హెచ్చరించారు. పాదయాత్రకు న్యాయ పోరాటం చేసిన పోలీసుల నుంచి ఏ విధమైనటువంటి అనుమతి రాలేదు. అయితే తాజాగా తన ఇంటి నుంచి షర్మిల బయటకు వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలా ఈమెను అడ్డుకోవడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. అయితే గతంలో కూడా షర్మిలను లోపాస్ పాండ్ నివాసం వద్ద అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -