Chiranjeevi: చిరంజీవి ఖాతాలో మరో అరుదైన ఘనత.. ఏం జరిగిందంటే?

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషన్ అవార్డు ఇవ్వబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. అధికారిక వర్గాల నుంచి సమాచారం లేకపోయినప్పటికీ క్షణాల్లో న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ తమ ఆనందాన్ని పంచుకోవడం మొదలుపెట్టారు.

నిజానికి అఫీషియల్ గా ఎలాంటి నోట్ రాలేదు. అయితే ప్రకటనలకు ముందు లీకులు సహజమే కాబట్టి వాస్తవం లేకుండా మరీ ఇంత స్థాయిలో ప్రచారం జరగకపోవచ్చు. కన్ఫర్మేషన్ అయితే రాలేదు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారానికి సంబంధించిన ధృవీకరణ జరిగేలా ఉన్నట్లు కనిపిస్తోంది. 2006లో పద్మ భూషణ్ అందుకున్న మెగాస్టార్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్నేళ్ళకే కాంగ్రెస్ లోకి విలీనం చేసి ఇప్పుడు పూర్తిగా సినిమాలకే అంకింతమయ్యారు. పద్మవిభూషణ్ ఆయన నటనకు ఇస్తున్న గౌరవం కాదు.

 

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది రక్త నేత్ర దానాలు చేయడంతో పాటు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణి, సినీ కార్మికులకు నిత్యావసరాల సరుకుల అందజేత లాంటి ఎన్నో కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని అన్ని విధాలుగా అర్హత ఉందని తేలాకే నిర్ణయం తీసుకుని ఉంటారని ఢిల్లీ టాక్. అలాగే ఇప్పటి వరకు మూడు వందల పై చిలుకు మాత్రమే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న వాళ్లలో ఉన్నారు. చిరంజీవికి వాళ్ళ సరసన చోటు దక్కితే అంతకన్నా గర్వకారణం అభిమానులకు మరొకటి ఉండదు. అదేదో అఫీషియల్ గా చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మరి ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మెగాస్టార్ అభిమానులకు ఇంతకంటే శుభవార్త మరొకటి ఉండదని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -