Munugode By-Election: మునుగోడులో టీఆర్ఎస్ కు మరో షాక్. ఆ పథకం డబ్బులు నిలిపివేత

Munugode By-Election: మునుగోడులో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఉన్న బీజేపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. భువనగిరి టీఆర్ఎస్ మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్ మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీలో చేరడంతో బీసీ సామాజికవర్గ ఓటర్లు టీఆర్ఎస్‌కు దూరం అవుతారనే చర్చ జరుగుతోంది. బీసీ సామాజికవర్గంలో ఆయనకు మంచి గుర్తింపు, పేరు ఉండటంతో మునుగోడులో త్వరలో నర్సయ్యగౌడ్ ప్రచారం నిర్వహించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బుధవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పెద్దల సమక్షంలో నర్సయ్యగౌడ్ కాషాయ కండువా కప్పుకున్నారు.

త్వరలోనే నర్సయ్యగౌడ్ మునుగోడులో రంగంలోకి దిగి బీసీల ఓట్లను ఆకర్షించేలా ప్రచారం చేయనున్నారు. బీసీలను ఆకట్టకునేలా సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ వర్గాలను ఇది కలవరపెడుతోంది. నర్సయ్యగౌడ్ ఇంత సడెన్ గా పార్టీని వీడితారని టీఆర్ఎస్ శ్రేణులు ఊహించలేదు. ఉన్నట్లుంటి ఆయన బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లి బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ లో అవమానించారని, టీఆర్ఎస్ లో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని నర్సయ్యగౌడ్ అన్నారు,. బీసీల పట్ల కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.

నర్సయ్యగౌడ్ షాక్ అలాగే ఉండగానే.. టీఆర్ఎస్ నేతలకు మునుగోడులో మరో షాక్ తగిలింది. మునుగోడులో గొర్రెల పంపకం పథకానికి బదలు నగదు ఇవ్వాలని కేసీఆర్ సర్కార ్నిర్ణయించింది. గొర్రెల పంపిణీకి బదులు నగదును లబ్దిదారుల అకౌంట్లో జమ చేసేలా నిబంధనలు సడలించిది. దీంతో ఇటీవల మునుగోడులోని గొర్రెల పంపిణీ లబ్దిదారుల అకౌంట్లో నగదు జమ చేశారు. నల్గొండ, భువనగిరి జిల్లాలోని లబ్దిదారులకు డబ్బులు జమ చేశారు. పశువర్దకశాఖ నిధులు విడుదల చేసిది. అయితే ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఎన్నికల క్రమంలో డబ్బులు ఇస్తూ ప్రభుత్వం ఓటర్లను ప్రలోభాలు గురి చేస్తుందంటూ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

దీంతో పోలింగ్ ముగిసే వరకు గొర్రెల పంపిణీకి సంబంధించి లబ్దిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం మానేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. దీనిపై పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డంకులు సృష్టిస్తుందన్నరు. గొల్ల, కుర్మలకు ఈ స్కీమ్ అందుబాటులో లేకుండా పోయిందన్నారు. నవంబర్ 6న మునుగోుడులో కౌంటింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల కోడ్ ఉండదని, అప్పటినుంచి ఈ పథకం అమలు చేస్తామన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -