Viveka Case: వివేకా కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే?

Viveka Case: వైయస్ ఫ్యామిలీకి వివేకానంద రెడ్డి హత్య కేసు ఎంతో ఇబ్బందికరంగా మారుతుందని చెప్పాలి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా ఇప్పటికే వయసు అవినాష్ రెడ్డి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అయితే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ప్రమేయం కూడా ఉందంటూ సిబిఐ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయిన మొదటి విషయం జగన్మోహన్ రెడ్డికే తెలిసిందని పలువురు ఇప్పటికే తెలియజేశారు ఉదయం 6 గంటల సమయానికే వివేక హత్య కేసు జగన్ కి తెలిసిందని, ఈ విషయాన్ని జగన్ స్వయంగా తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి చెప్పారన్న ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం ఇటీవల మీడియా సమావేశం పెట్టారు.

 

ఈ క్రమంలోని ఈయన మీడియాతో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి చనిపోయిన విషయాన్ని తమకు జగన్మోహన్ రెడ్డి చెప్పారని తెలియజేశారు. మరో వైపు ఉదయమే వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి .. జగన్‌, భారతి పీఏలకు ఫోన్లు చేసి వారితో మాట్లాడాలని చెప్పినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు.

 

ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు జగన్ భారతీ పీఏ లను కూడా పిలిచి విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం ఈ కేసు మరో మలుపు తిరగబోతుందని తెలుస్తుంది.ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు దాదాపు మూడు రోజులపాటు అక్కడే ఉంటారు. మరోవైపు అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈమెను హైదరాబాద్ తరలించారు. ఇలాంటి సమయంలో సీబీఐ వేసిన అనుబంధ అఫిడవిట్ సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -