Trivikram: పచ్చి బూతులతో మరో తెలుగు సినిమా ట్రైలర్.. త్రివిక్రమ్ భార్య సినిమాలో ఇలాంటి బూతులా?

Trivikram: సినీ నిర్మాత చినబాబు పేరు చెప్పగానే అందరికీ ఆల వైకుంఠపురం లో, సన్నాఫ్ సత్యమూర్తి ఇలాంటి మంచి సినిమాలు గుర్తొస్తాయి. ఇప్పుడు ఆయన కూతురు హారిక కూడా ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని నిర్మాతగా మారి తొలి సినిమా తీశారు. అయితే తండ్రి లాగా మంచి సినిమాలు తీసారేమో అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఆ ట్రైలర్ చూసిన నెటిజన్స్ ఇంత బూతు సినిమానా అంటూ అప్పుడే ట్రోల్స్ వేసేస్తున్నారు.

ఈ సినిమాకి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంది. అయితే చిన్న బాబుని దృష్టిలో పెట్టుకొని ఆమె కూతురు కూడా అలాంటి సినిమాలే తీస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన జనాలు టీజర్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యతో కలిపి తీసిన ఈ అడల్ట్ మూవీ పేరు మ్యాడ్.

 

అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరనేది పక్కన పెడితే కంటెంట్ మాత్రం చాలా ఘోరంగా ఉంది అంటున్నారు టీజర్ చూసిన ప్రేక్షకులు. అయితే మ్యాడ్ టీజర్ చూస్తుంటే హారిక, హాసిని.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల స్థాయికి ఏమాత్రం ఈ సినిమా సరిపోదు అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సైతం దుమ్మెత్తి పోస్తున్నారు జనాలు. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా ఈ బ్యానర్ పై ఎలాంటి సినిమాలు పట్టాలెక్కదనే విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా తెరమీదకి వచ్చిందంటే కచ్చితంగా ఆయన హస్తం కూడా ఉండే ఉంటుంది అంటున్నారు.

 

దిల్ రాజు కూతురు హన్సికతో చినబాబు కూతురిని పోలుస్తూ సెటైర్లు వేస్తున్నారు. దిల్ రాజు కూతురు నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం బలగం.ఆ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించి, ఎన్ని అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుందో అందరికీ తెలిసిందే. అయితే అంత ఘనంగా కాకపోయినా ఒక మంచి కుటుంబ కథా చిత్రంతో హారిక నిర్మాతగా పరిచయమైతే బాగుండేది అంటున్నారు ప్రేక్షకులు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -