Election Schedule: వైసీపీకి మరికొన్ని గంటలే సమయం.. ఎన్నికల షెడ్యూల్ వస్తే వైసీపీ పాలన నుంచి విముక్తి లభిస్తుందా?

Election Schedule: ఏపీలో వైసీపీ సర్కార్‌కు కాలం దగ్గర పడింది. సాయంత్రం 3 గంటలకు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల అవుతుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు.. ఏపీ, ఒడిశా, సిక్కి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఆ తర్వాత ప్రభుత్వాలకు ఉన్న అధికారాలు ఊడిపోతాయి. రాష్ట్రంలోని అధికారులంతా ఈసీ కింద పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా పథకాలు అమలు చేయడానికి ఉండదు. ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ప్రకటించడానికి అవకాశం లేదు. అంతెందుకు.. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడానికి కుదరదు. అందుకే ప్రధాని మోడీ కూడా గత కొన్ని రోజులుగా సుడిగాలి పర్యటనలు చేస్తూ శంకుస్థాపానలు పూర్తి చేశారు. గత 20 రోజుల్లోనే ప్రధాని లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇక ఏపీ సీఎం జగన్ వరుసగా బటన్ నొక్కే కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే చేశారు. అయితే, ఆ బటన్లు పని చేయలేదని.. లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమకాలేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. కానీ.. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఇలా పని చేయని బటన్లు కూడా నొక్కే అవకాశం ఉండదు.

షెడ్యూల్ వచ్చిన తర్వాత పరిపాలన కొంతవరకు మెరుగ్గానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే.. పార్టీలకు అనుకూలమైన వైఖరిని ఇప్పుడు అధికారులు చూపించలేదు. ఎన్నికల సంఘం కిందే అందరు అధికారులు పని చేయాల్సి ఉంటుంది. ఇకపై జగన్ ప్రభుత్వం అధికారులను విచ్చల విడిగా వాడుకునే అవకాశం ఉండదు. బటన్ నొక్కే సభలకు పథకాల లబ్ధిదారులను తరలించే బాధ్యతలు అధికారులు, వాలంటీర్లపై జగన్ సర్కార్ పెట్టేంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఉండదు. ఐదేళ్లలో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి వేధించిన ఘటనలు చాలానే ఉన్నాయి.

కానీ… షెడ్యూల్ రిలీజ్ అయితే.. పోలీసులు వైసీపీ నేతల మాటలు వినే అవకాశం ఉందడు. మహా అయితే జగన్ ఎన్నికల ప్రచారాన్ని చేసుకుంటారు. తమ సభలకు జనసమీకరణ బాధ్యతలు పార్టీ నేతలు, కార్యకర్తల మీదే పెట్టాలి తప్పా.. అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి గత ఎన్నికల ముందు వైసీపీకి అధికారులు సహకరించారు. దానికి ప్రధాన కారణం బీజేపీ పరోక్షంగా వైసీపీకి మద్దతిచ్చింది. దీంతో.. అధికారులు, పోలీసులు వైసీపీకి అనుకూల వైఖరి తీసుకున్నారు. కానీ.. ఈసారి ఆ అవకాశం ఇవ్వకూడదనే.. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి.. అధికారులను, పోలీసులు విచ్చల విడిగా వాడుకోవాలంటే.. ఎన్నికల కోడ్ తో పాటు.. బీజేపీ కూడా జగన్ ను అడ్డుకుంటూనే ఉంటాయి. ఒక్క వైసీపీకి మాత్రమే కాదు.. కేంద్రంలోని బీజేపీకి.. మిగిలిన రాష్ట్రాల్లోనే అధికార పార్టీలకు ఇప్పుడు ప్రత్యేకమైన అధికారాలు పోతాయి. జగన్ ఏ సభకు వెళ్లాలి అన్నా.. వైసీపీ అధినేతగానే హాజరవుతారు. సీఎం హోదాలో హాజరు కాలేరు. ఓరకంగా చెప్పాలంటే ఏపీలో సాయంత్రం 3 గంటల తర్వాత అరాచకపాలన నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుంది. ఎన్నికల తర్వాత ఎలాంటి పాలన ఉంటుంది అనేది తర్వాత వచ్చే ఫలితాలే నిర్ణయిస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -