Sharmila: షర్మిలకు షాకులు ఇవ్వడానికి ఏపీ బీజేపీ సిద్ధమైందా.. ఏం జరిగిందంటే?

Sharmila: ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటివరకు ప్రత్యేక హోదా రాలేదు అయితే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కేంద్రం మెడలు మంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనకు కూడా రాలేదు గత నాలుగేళ్ల కాలంలో ఈ ప్రత్యేక హోదా పెద్దగా చర్చలకు రాలేదని చెప్పాలి.

 

జగన్మోహన్ రెడ్డి సైతం ప్రత్యేక హోదా విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నికైనటువంటి వైయస్ షర్మిల ప్రత్యేక హోదా విషయాన్ని తెరపైకి తీసుకువస్తూ రచ్చ చేస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి ఈమె ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కూడా సెటైర్లు వేస్తున్నారు దీంతో కేంద్ర బిజెపి నేతలు వైయస్ షర్మిలకు కౌంటర్ ఇవ్వటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

వైసిపి పార్టీకి చెందిన ఓ ఎంపీని పిలిపించి వైయస్ షర్మిల విషయం పట్ల నిలదీశారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అంశాన్ని షర్మిల కావాలనే తెరపైకి తెస్తున్నారు. మేం ఎదురు దాడికి దిగాం. మీ పార్టీ నుంచి ఎవ్వరూ మాట్లాడట్లేదు. అలా వదిలేస్తే ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు దీంతో ఏపీ బీజేపీ నాయకులు షర్మిల పై ఎదురు దాడి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

 

ఇలా వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పట్ల విమర్శలు కురిపిస్తున్నటువంటి షర్మిలకు ఇకపై ఏపీ బీజేపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తమ ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు కురిపిస్తే వారికి లెఫ్ట్ రైట్ ఇచ్చే వైసిపి నేతలు షర్మిల విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -