Sharmila Meets DK: డీకే శివకుమార్ తో భేటీ అయిన షర్మిల.. అక్కడ లెక్కలు పూర్తిస్థాయిలో మార్చేస్తారా?

Sharmila Meets DK: వైయస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయాలలోకి అడుగు పెట్టారు. మొదటి తెలంగాణలో పార్టీ పెట్టినటువంటి ఈమె ఆ పార్టీని కాస్త కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.ఇలా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి ఈమె ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఇక ఈమె పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలా జగన్ పట్ల విమర్శలు చేసినటువంటి ఈమె కడపలో ఎంపీగా పోటీకి సై అన్నారు అక్కడ ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఈమె బస్సు యాత్ర కాస్త తుస్సుమంది.

ఇక ఈమెకు ఎదురుగానే కొంతమంది జగన్ ప్రభుత్వానికి మేము ఓట్లు ఎందుకు వేయకూడదు నీకెందుకు వేయాలి మీ కుటుంబ విషయాలలో గొడవలు ఉంటే మీరు చూసుకోండి కానీ మాకు జగన్ మంచే చేశారు నువ్వు కూడా జగన్ ని ఏమీ అనొద్దు అంటూ డైరెక్ట్ గా చెప్పేస్తున్నటువంటి పరిస్థితుల్లో కడపలో ఏర్పడ్డాయి. ఇక బస్సు యాత్రలో భాగంగా అక్కడికి వచ్చినటువంటి జనాభా ఏకంగా జై జగన్ అని అనడంతో షర్మిల నోట మాట రాలేదు.

ఇలా కడపలో పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి షర్మిల ఉన్న పలంగా తన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి బెంగళూరు వెళ్లారని తెలుస్తుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ తో ఈమె భేటీ కావడంతో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి షర్మిలను కాంగ్రెస్ పార్టీ చెంతకు చేర్చడంలో డీకే పాత్ర చాలా ఉంది అలాగే తెలంగాణలో కాంగ్రెస్ రావడం వెనుక కూడా ఈయన కృషి ఉందని చెప్పాలి.

ఇలా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఆమె అక్కడ వివరించి తన రాజకీయ భవిష్యత్తు ఏంటనే విషయంపై ఆయనతో చర్చలు జరపడానికే వెళ్లారని తెలుస్తుంది. ఏది ఏమైనా రాజకీయాలలోకి వచ్చి తన అన్నకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ షర్మిల రాజకీయ భవిష్యత్తు కోల్పోయారని ఇప్పుడిప్పుడే తనకు బోధన పడినట్లు ఉంది. అందుకే తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నార్థకంతోనే ఈమె డీకే శివకుమార్ ని కలిసారని స్పష్టంగా అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -