AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టేనట.. ఆ పని చేసి జగన్ ప్రజల్ని మోసం చేశారా?

AP Special Status: ఏపీ సీఎం జగన్ ప్రత్యేక హోదాను కేంద్రానికి అమ్మేసారు. మరొకసారి హోదా అనే మాటెత్తనని స్పష్టం చేసి దానికి బదులుగా డబ్బులు తెచ్చుకున్నారు. అయితే ఈ వ్యవహారం కేంద్రం పార్లమెంట్ సాక్షిగా బయట పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీకి నిధులు ఇచ్చి నిధులు తెచ్చుకుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని హోదా ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించడం లేదని గతంలో తెలిపిన విషయం తెలిసిందే. అయితే దానికి చంద్రబాబు అంగీకరించారు.

ప్యాకేజీ ప్రకటించారు. హోదా కన్నా ఎక్కువ లాభాలు వస్తాయని నిధులు వస్తాయని లెక్కలేశారు. అయితే గతంలో జగన్ హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టేశారని ప్రచారాలు చేశారు. డిఫెన్స్ లో పడిపోయిన చంద్రబాబు ప్యాకేజీతో పాటు హోదా కావాలని రాజకీయం మార్చారు. ఫలితంగా ప్యాకేజీ రాలేదు హోదా కూడా రాలేదు. దీన్ని చూపించి తనకు ఎంపీ సీట్లు మెడలు వంచుతానని జగన్ చెప్పుకున్నారు. జనం ఎంపీ సీట్లు ఇస్తే ఆయన ఇప్పుడు హోదాను కేంద్రానికి అమ్మేశారు. కాగా ఇటీవల కేంద్రం రాష్ట్రానికి రూ.10, 461 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తం ఏపీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

 

అయితే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింద అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు మంగళవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బదులిచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటుకు గానూ రూ.10, 461 కోట్లు ఈ ఏడాది మేలో విడుదల చేసినట్టు తెలిపారు. ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు గ్రాంట్ క్రింద రూ.10,460.87 కోట్లు విడుదల చేశామని అన్నారు.
హోదా వస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ అవుతుందని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు జగన్ రెడ్డి, హోదా వస్తే ఇన్ కంట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -