DSC Exams: ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్షలు.. ఏపీలో నిరుద్యోగులతో జీవితాలతో చెలగాటమా?

DSC Exams: ఏపీలో డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని ఆ పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీ మాటలకే పరిమితం అయ్యింది. డీఎస్సీ అభ్యర్థులు నిరీక్షించి, ధర్నాలు చేసి, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. ఎన్నికలకు మూడు నెలల ముందు డీఎస్సీ నోటీఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా డీఎస్సీ అభ్యర్థులను మభ్యపెట్టాడానికి మాత్రమే.

ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. నిజంగానే నోటిఫికేషన్ ఇవ్వాలంటే.. ఎన్నికలకు ఏడాది ముందు అయినా ఇవ్వాలి. కనీసం ఆరు నెలల ముందు ఇచ్చినా ఎన్నికల సమయానికి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉందేది. కానీ, మూడు నెలల ముందు ఇచ్చి నిరుద్యోగులకు మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను ఆకట్టుకొని.. ఎలక్షన్ కోడ్ పేరుతో నోటిఫికేషన్ అడ్డుకోవచ్చని ఆయన వైసీపీ వ్యూహం. రిలీజ్ చేసిన ఆ నోటిఫికేషన్ కూడా తప్పులు తడకలకు ఉండంతో.. హైకోర్టుతో మొట్టికాయలు కూడా తిన్నారు. దీంతో.. మళ్లీ నోటిఫికేషన్ లో కొన్ని తేదీలు మార్చారు. ఇలా అడుగడుగునా తప్పులు చేస్తూ.. ఇప్పుడు అంతా ఈసీ చేతిలోనే ఉంది. తమకు సంబంధం లేదనేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.

ఇప్పుడు డీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తారా? షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా? అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ షెడ్యూల్ మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఎగ్జామ్ సెంటర్స్ ఎంపికకు ఈ నెల 20న ఆఫ్షన్స్ పెట్టుకోవాలని అన్నారు. ఆ తర్వాత 25 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ.. ఇంతవరకూ వెబ్ సైట్ లో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే అవకాశమే కల్పించలేదు.

ఇక టెట్ ఫలితాలు ఈ నెల 14న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ, అది కూడా జరగలేదు. దానికి విద్యాశాఖ అధికారులు ఏవో కారణాలు చెబుతున్నారు. దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేకపోతే వాయిదా వేస్తారా? అనే అయోమయంలో డీఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. డీఎస్సీ నిర్వహించాలా? వద్దా అనేది ఈసీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కామెంట్స్ చూస్తే డీఎస్సీ నిర్వాహణ ఎన్నికల ముందు జరిగే అవకాశం లేనట్టే ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనుమతితోనే డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అంతవరకూ టెట్ ఫలితాలు కూడా రిలీజ్ చేయొద్దన అన్నారు. డీఎస్సీ నిర్వహంచాలని కొందరు.. వాయిదా వేయాలని మరికొందరు ఫోన్ కాల్స్, మెయిల్స్ పంపిస్తున్నారని చెప్పారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొని వెళ్లామని ఆయన చెప్పారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతుల్లో డీఎస్సీ భవితవ్యం ఆధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

మొత్తానికి ఎన్నికలకు మూడు నెలలు ముందు నిరుద్యోగుల్లో ఆశలు కల్పించి.. వారి ఆశలపై వైసీపీ ప్రభుత్వం నీళ్లు చల్లిందనే చెప్పాలి. ఎన్నికలకు మూడు నెలల ముందు నోటిఫికేషన్ విడుదల చేస్తే కచ్చితంగా ఇలాంటి ఇబ్బందుల ఎదురవుతాయని ప్రభుత్వానికి ఓ అంచనా ఉంటుంది. కానీ.. నిరుద్యోగులను మభ్యపెట్టడానికే ఇలా చేశారు. ఈ రాజకీయాలకు ఏళ్ల తరబడి లైబ్రరీల్లో, రీడింగ్ హాల్స్‌లో, అద్దెలు కొట్టుకొని రూమ్స్ తీసుకొని ఉంటున్న నిరుద్యోగులు బలి అయిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -