Jagan: ఏపీ అంతా శత్రువులే.. వాళ్లు అంటే జగన్ కు ఇంత భయమా?

Jagan: ఏపీలో రాజకీయ వేడి రోజరోజుకి పెరుగుతోంది. వైసీపీకీ ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. మొన్నటి వరకూ టీడీపీ, జనసేన మాత్రమే అని అనుకున్న జగన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏపీలో రాజకీయల్లో షర్మిల ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ కూడా బలమైన ప్రత్యర్థిలా మారుతోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా కలిసినట్టే తెలుస్తోంది. దీంతో బీజేపీ కూడా మరో ప్రత్యర్థిగా తయారైంది. వీటన్నింటికి బోనస్‌గా సొంతపార్టీ నేతలు, అసమ్మతి వర్గాలు నెమ్మదిగా వాయిస్ పెంచుతున్నారు.

 

ఇవన్నీ పక్కన పెడితే సీఎం జగన్ వదిలిన బాణం తిరిగి తననే టార్గెట్ చేసింది. సొంత చెల్లి ఎంట్రీ ఇబ్బందికరంగా మారింది. షర్మిల.. జగన్‌కు చెవి దగ్గర జోరీగలా మారింది. ఎవరి మాట వినని జగన్.. షర్మిల మాట వినాల్సి వస్తుంది. పరిస్తితులను ఆమె అలా మార్చారు. రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అర్థం అవుతోంది. తన ప్రాణహాని ఉందని ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఆమెకు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ పెంచింది. జగన్ అంత త్వరగా ఎవరి విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదు. కానీ, షర్మిల విషయంలో తీసుకున్నారు. ఎందుకంటే.. బాబాయ్ వివేకా హత్య నిందితులను జగన్ కాపాడుతున్నారని షర్మిల బహిరంగంగానే చెబుతున్నారు. గత ఎన్నికల్లో వివేకాహత్యను వైసీపీ అనుకూలంగా వాడుకుంది. ఇది జనాల్లోకి కూడా బలంగా వెళ్లింది. కాబట్టి.. షర్మలకు సెక్యూరిటీ పెంచకపోతే.. వివేకాహత్య కేసు మరింతగా ప్రచారంలోకి వస్తుంది. సో.. గత్యంతరం లేక షర్మిలకు అడిగిన వెంటనే సెక్యూరిటీ పెంచారు.

ప్రస్తుతం ఇంతమంది ప్రత్యర్థులతో జగన్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. కానీ, పద్మవ్యూహంలోనే ఉండిపోవడానికి నేను అభిమన్యుడిని కాదు.. అర్జుణుడిని అని జగన్ అంటున్నారు. దీన్ని కూడా షర్మిల తన ప్రచారానికి వాడుకుంటున్నారు. అర్జుణుడివి అయితే.. గాంధీవంతో యుద్దం చేయాలి కానీ కేంద్రం దగ్గర ఎందుకు మోకరిళ్లుతున్నావని జగన్‌ని ప్రశ్నించారు. అమిత్ షా, మోడీ దగ్గర ఎందుకు భయపడుతున్నావని నిలదీశారు. ప్రత్యేకహోదా, విభజన హామీలను ఎందుకు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జునుడు ఇలా ఎవరి బెదిరింపులకు లొంగరని షర్మిల మండిపడుతున్నారు.

 

షర్మిల మాటల దాడికి తట్టుకోలేక.. జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేకహోదా గురించి మాట్లాడాల్సి వచ్చింది. బీజేపీకి కేంద్రంలో మెజారిటీ ఉంది కాబట్టి మనం ఏం చేయలేమని అన్నారు. అంతేకాదు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకహోదాను చట్టంలో పెట్టలేదు కనుక మనం కోర్టుకు కూడా వెళ్లలేమని చెప్పేశారు. కాంగ్రెస్ పై నిందవేసే ప్రయత్నం చేశారు. నిందలు ఎవరి మీద మోపినా.. ప్రత్యేకహోదా గురించి జగన్ నోరు విప్పేల షర్మిల చేశారు.

 

అంతేకాదు.. ప్రత్యేకహోదా కోసం ప్రత్యేక విమానంలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీనిని కలిసారని వైసీపీ ప్రచారం చేస్తున్నారు. కానీ, ఢిల్లీ ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసు. కానీ, ప్రచారం మాత్రం ప్రత్యేకహోదా కోసమే అంటున్నారు. దీంతో, ఆ క్రెడిట్ షర్మిల ఖాతలో పడుతోంది. ఎందుకంటే.. షర్మిల ప్రత్యేకహోదా గురించి నిలదీయడం వలనే జగన్ ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ కు నోటా కంటే తక్కువ వచ్చాయి. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన షర్మిలతో వైసీపీకి వచ్చిన నష్టం లేదని వైసీపీ ప్రచారం చేసింది. షర్మిల ప్రభావం ఏపీలో ఉండదనుకునేటప్పుడు జగన్ ఆగమేఘాల మీద ఢిల్లీ ఎందుకు వెళ్లారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మొత్తానికి జగన్ కు షర్మిల భయం పట్టుకుందని అర్థమవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -