Hanuman Movie: అయోధ్యకు హనుమాన్ టీమ్ విరాళంపై ప్రశంసలు.. ఏం జరిగిందంటే?

Hanuman Movie: తేజ సబ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకిస్తున్న సినిమా హనుమాన్ జనవరి 12న విడుదల అయింది. ఈ సినిమాకి ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత భారీ అంచనాలు రేపట్టాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ అందుకొని భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా విడుదల కి ముందు రోజు ప్రీమియర్లు 1000 కు పైగా స్క్రీన్ లలో వేశారు.

 

అప్పటికే చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ అయిపోయింది ఈ సినిమా. ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఈ చిత్రానికి అమ్ముడైన ప్రతి టిక్కెట్ లోను ఐదు రూపాయలను అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విరాళంగా ఇస్తాము అని చెప్పారు. అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మొదటి రోజు 2 లక్షల టికెట్లు అమ్ముడు పోగా దాంట్లో వచ్చిన 14.25 లక్షల రూపాయల వరకు చెక్ రాసి రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే సాముద్రికని, అమృత అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శీను, వెన్నెల కిషోర్ వంటి పలువురు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా తేజ కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా అవుతుందని దేశవ్యాప్తంగా మంచి బ్లాక్ బస్టర్ అందుకుందని అభిమానులు తెలుపుతున్నారు. ఒక సామాన్యుడికి హనుమంతుని శక్తులు వస్తే ఎలా ఉంటుందో అనే దాని మీద ఈ సినిమా ఉంటుంది. ఇది ఒక మల్టీ యూనివర్స్ సినిమా.

 

ఇందులో మొత్తం 12 సినిమాలు ఉంటాయని అందులో మొదటి సినిమా ఈ హనుమాన్ అని తెలిపారు దర్శకుడు. కేవలం మొదటి రోజే కాకుండా సినిమా ఆడినన్ని రోజులు వచ్చిన ప్రతి టిక్కెట్ పై ఐదు రూపాయలను పక్కకు పెట్టి వాటిని రామ మందిరానికి విరాళంగా ఇస్తాము అని మరీ మరీ చెప్పారు చిత్ర బృందం. ఇలా చేస్తున్నందుకు దేశవ్యాప్తంగా అందరి దగ్గర నుంచి అభినందనలు అందుకుంటుంది ఈ చిత్రం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -