Hanuman Movie: హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ కావడానికి మెగాస్టార్ కారణమా?

Hanuman Movie: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు మెగాస్టార్. కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలలో కూడా చాలామంది చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. స్టార్ స్టేటస్ తో ఒక వెలుగు వెలుగుతున్న ఎంతోమంది సెలబ్రిటీలు మేము చిరంజీవి అభిమానులమని చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఫ్రీ రిలీజ్ వేడుకలకు హాజరవుతూ ఉంటారు.

చిన్న సినిమాలకు కూడా తన వంతు సహకారం అందిస్తూ ఉంటారు. ఇటీవలె హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. హనుమాన్ సక్సెస్ వెనుక చిరంజీవి పాత్ర కొంత ఉందని అందరూ అంగీకరించాల్సిందే. చిన్న సినిమాలకు సెంటిమెంట్ గా మారిన చిరంజీవి రాబోయే రోజుల్లో మరిన్ని చిన్న సినిమాలను ప్రోత్సహిస్తారేమో చూడాలి మరి. హనుమాన్ మూవీకి ఈరోజు కూడా అదిరిపోయే స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు హనుమాన్ హవాకు బ్రేకులు వేయలేరని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

ఫిబ్రవరి 9వ తేదీన సినిమాలు విడుదలయ్యే వరకు హనుమాన్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. హనుమాన్ మూవీ లాంగ్ రన్ లో కలెక్షన్ల పరంగా మరిన్ని రికార్డ్ లను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు. ఆ సంగతి అటు ఉంచితే చిరంజీవి గోల్డెన్ హ్యాండ్ పడడం వల్లే హనుమాన్ మూవీకి సక్సెస్ వచ్చిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడానికి చిరంజీవి కారణమా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -