AP People: ఏపీ ప్రజలు అలా ఆలోచిస్తున్నారా.. అసలు వాస్తవాలు ఏంటంటే?

AP People: ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రెండు ప్రాంతీయ పార్టీలుగా ఎంతో మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంది. అయితే ఏపీ ప్రజలు ఈ రెండు పార్టీల వల్ల ఎంతో నష్టపోయామని భావించి బిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని కెసిఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు అంటూ బిఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి ఈయన వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు ఎంతో విసుగు చెందారని అధికంగా పెరిగిన ధరల వల్ల ప్రజలందరూ ఆగమాగామయ్యారని తెలియజేశారు. ఏపీ ప్రజలు బాగుపడాలి అంటే తప్పనిసరిగా ఇక్కడ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చాలామంది కోరుకుంటున్నారనీ తోట చంద్రశేఖర్ తెలిపారు.

 

తాను ఏ ప్రాంతంలో పర్యటించిన ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ ఏపీలో పాలన నిర్వహించాలని కోరుతున్నారని ఈయన తెలిపారు. అయితే ఈయన పార్టీ అధ్యక్షుడు కనుక అలా మాట్లాడటంలో తప్పులేదు కానీ ఇక్కడ ధరలు అధికంగా ఉన్నాయి అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని తెలుస్తోంది. ఇక్కడ నిత్యవసర సరుకులు అయినటువంటి పెట్రోల్ డీజిల్ వంటి వస్తువులను కేంద్రం నిర్ణయిస్తుంది. ఈ ధరలు తగ్గితే ఆటోమేటిక్గా నిత్యవసర ధరలని తగ్గుతాయి. ఈ విషయం తోటకు తెలియదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇక తెలంగాణలో ఆంధ్రాలో నిత్యవసర ధరలు అన్ని కూడా సమానంగానే ఉన్నాయని, ఇలా తెలంగాణలో కూడా ఇవే ధరలు ఉన్నాయి అంటే అక్కడ కెసిఆర్ పాలన కూడా సరిగా లేదనే కదా అర్థం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఈ వాస్తవాలో తెలియక తోట ఈ విధంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో గెలవడం కాస్త కష్టతరమే అన్న సందేహాలు సొంత పార్టీ నేతలలో కూడా ఉండడంతోనే కొందరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బదిలీ అయ్యారు. వచ్చే ఎన్నికలలో కెసిఆర్ గెలవడం అసాధ్యం అంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -