CM Jagan: ప్రజలంటే ఏపీ సీఎం జగన్ కు భయమా.. అందుకే ఇలా చేశారా?

CM Jagan: త్వరలో జగన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తిచేసుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. ఆయన రాజకీయంగా ఎలాంటి అభివృద్ధి సాధించారు ఆయనకే తెలియాలి. అయితే ఈ ఐదేళ్లలో ప్రజలు జగన్ ని కలవడం గానీ, జగన్ ప్రజలను కలవడం గానీ జరగలేదు.

 

త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ దృష్ట్యా మళ్లీ ప్రజల మధ్యకు రావాలేమో కానీ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి అయితే ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రజల వద్దకు వెళ్ళలేదు జగన్. 144 సెక్షన్ ఆయన చుట్టూ వైఫైలా ఉంటుంది. మామూలుగా ముఖ్యమంత్రి ఆఫీసు లేదా ఇల్లు ప్రజలకు ఒక ఆసరా అక్కడికి వెళ్తే తమ సమస్య తీరుతుంది అనే ఒక భరోసా ఉండేది కానీ జగన్ రెడ్డి ఇంటి వద్దకు మనుషులు కాదు కదా చీమలు కూడా వెళ్లలేవు.

ఎందుకంటే ఆయన ఇంటి కి 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ ఎప్పుడు అమలులో ఉంటుంది. ప్రజలకి ఇంత భయపడే ముఖ్యమంత్రి చరిత్రలో లేడు అంటూ సెటైర్లు వేస్తున్నారు జనాలు. ప్రజా దర్బరు నిర్వహిస్తానని అధికారంలోకి వచ్చిన కొత్తలో స్టేట్మెంట్ ఇచ్చారు వైఎస్ జగన్ అయితే పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సి వస్తుందని భయపడ్డారు.

 

లేదంటే కొన్ని వేల మంది జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని భయపడ్డారు తెలియదు కానీ ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రజా దర్బారు నిర్వహించలేదు. జగన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేశారు పదవి చేపట్టిన వెంటనే ప్రజలకి అందుబాటులో లేకుండా తన చుట్టూ 144 సెక్షన్ విధించుకొని ఎవరికి ముఖం చూపించకుండా రాజ భవనంలో నివసిస్తున్నాడు. ప్రజలకు భయపడి దాక్కునే ఏకైక ముఖ్యమంత్రి అంటూ సీఎం జగన్ ని ఎద్దేవా చేస్తున్నారు ప్రజలు ప్రతిపక్ష నాయకులు. మరి దీనిపై వైసీపీ వర్గం వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -