Bunny: థియేటర్ లో టపాసులు పేల్చిన బన్నీ ఫ్యాన్స్.. అసలు మనుషులేనా?

Bunny: స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్ల వద్ద అభిమానుల సందడి హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ కటౌట్లతో, టపాసులు,అరుపులు, కేకలతో పండుగ వాతావరణం తీసుకొస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. దీంతో స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,రామ్ చరణ్ సినిమాలు రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఏప్రిల్ 8వ తేదీన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాను రీ రిలీజ్ చేశారు. అయితే బర్త్డే కి రెండు రోజుల ముందే ఏప్రిల్‌ 6న గ్రాండ్‌గా రీరిలీజ్‌ చేశారు. దాంతో అభిమానులు థియేటర్లకు వరుసగా క్యూ కట్టారు. ఈ క్రమంలో సంధ్య 70 ఎమ్‌ఎమ్‌ థియేటర్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. డైలాగులు, పాటలు వచ్చిన ప్రతిసారి ఈలలు, కేకలు, అరుపులతో థియేటర్‌ దద్దరిల్లిపోయేలా చేశారు.

అంతవరకు బాగానే అభిమానులు అంతటితో ఆగకుండా పేపర్లు చింపుతూ థియేటర్‌ లోపలే టపాసులు పేల్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షోని ఆపేసి థియేటర్ లోకి వెళ్లి అభిమానులను హెచ్చరించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి నిర్మాత శ్రీనివాస కుమార్‌ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్‌ లోపల టపాసులు పేల్చడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

దయచేసి అభిమానులు సీట్లకు, థియేటర్‌కు డ్యామేజీ చేయవద్దని కోరుతుతున్నాను. సినిమాను ఎంజాయ్‌ చేయండి. అలాగే థియేటర్స్ ని దేవాలయాలుగా భావించే థియేటర్లను రక్షించండి అని ట్వీట్‌ చేశాడు. కాగా అందుకు సంబందించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ అల్లు అర్జున్ ఫాన్స్ ని తిట్టిపోస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ కు అసలు బుద్ధుందా.. థియేటర్లో టపాసులు పేలుస్తారా,అవసరమా? అంటూ మండి పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -