Elections: అక్టోబర్ లోనే ఎన్నికలు జరగనున్నాయా.. రాష్ట్రంలో జరగబోయేది ఇదేనా?

Elections: అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్నాయని అందుకు పూర్తిగా రెడీగా ఉండాలి అంటూ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టిఆర్ఎస్ లు ఇప్పటికే దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యేలకు ఒక సందేహం నెలకొంది. అదేమిటంటే డిసెంబర్‌లో కదా ఎన్నికలు రెండు నెలలు ముందుగానే ఎందుకు వస్తాయి అంటూ ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యే లకు తెలియని విషయం ఏమిటంటే ఎమ్మెల్యేలను సన్నద్ధం చేయడానికే ఇలా చెబుతున్నారని అంటున్నారు.

నిజానికి సమయం ప్రకారం జరిగినా అక్టోబర్ నెల ద్వితీయార్థంలో ఎన్నికల ప్రకటన ఉండవచ్చు. ఆ తరువాత డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ ఉంటుంది. అందుకే అక్టోబర్‌ కి డెడ్ లైన్ ని కెసిఆర్ పెట్టారని అంటున్నారు. కాగా గతంలో ఎప్పుడు కార్యవర్గ సమావేశం జరిగినా కేసీఆర్ పార్టీ నేతలందరికీ ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సిట్టింగ్‌లు అందరికీ మళ్లీ టిక్కెట్లు ఇస్తామని నియోజకవర్గాలకు వెళ్లి పని చేసుకోవాలి అని ఒక భరోసాని ఇచ్చేవారు. కానీ ఈ సారి మాత్రం టోన్ మారింది. ఇప్పటి వరకూ కేసీఆర్, కేటీఆర్ చేసిన హెచ్చరికల ప్రకారం చాలా మందికి టిక్కెట్లు డౌట్ అని ప్రచారం ప్రారంభమయింది.

 

సర్వేల్లో అనుకూలంగా వచ్చే వారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పనితీరును మార్చుకోవాలని సిట్టింగ్‌లకు సూచించారు. కాగా గతంలో దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్ ఉండదన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. ఆ సమయంలో కొందరు ఎమ్మెల్యేల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. బీజేపీ వారిని ఆకర్షించేందుకు తెగ ప్రయత్నిస్తోందని తెలియగానే టీఆర్ఎస్ హై కమాండ్ అప్రమత్తమయినట్లుగా కనిపిస్తోంది. సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఉంటాయని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు మాత్రం యాభై మందికి కాదు కదా కనీసం ముప్పై మందికి కూడా డౌటే అని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -