IPS: ఎన్నికల ముందు వైసీపీ ఐపీఎస్ లను బదిలీ చేయడానికి కారణాలివేనా?

IPS: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 30 మంది ఐపీఎస్ లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తిన ఐపీఎస్ అధికారులకు కీలక పోస్టులు దక్కాయి. ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తమకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులను ఆయా పోస్టుల్లోకి బదిలీ చేసింది. స్థాయికి మించి పోస్టింగ్ వివాదాస్పద అధికారులను వైఎస్ఆర్సిపి కి బాగా అనుకూలంగా వ్యవహరించిన వారిని నెత్తిన పెట్టుకుంది.

 

కొందరు మంత్రులు తమకు నచ్చిన అధికారులను నచ్చిన చోట నియమింప చేసుకున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో వారు ఆయా పోస్టింగ్లలోనే కొనసాగనున్నారు వైకాపా కు అడుగులకు మడుగులొత్తిన అధికారులకు కీలక స్థానాలు దక్కాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన ఐజి కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతిగా నియమించింది. డైరెక్టర్ జనరల్ స్థాయి హోదా కలిగిన అధికారులను మాత్రమే ఈ పోస్ట్ కు ఎంపిక చేస్తారు.

కానీ ఐసి హోదా కలిగిన రఘురాం రెడ్డికి డిజి ర్యాంకు పోస్ట్ కట్ట పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం ఏర్పాటుచేసిన సీటుకు ఆయనే నేతృత్వం వహించారు. వైఎస్ఆర్ సీపీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆయనకు ఈ పోస్టింగు దక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అధికార పార్టీకి కొమ్ముకాసిన మరికొందరు అధికారులకు సైతం కీలక పోస్టులు దక్కాయి.

 

కర్నూలు రేంజి డిఐజిగా నియమితులైన సిహెచ్ విజయరావు నెల్లూరు జిల్లాలో ఎస్పీగా పని చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిందితుడుగా ఉన్న అవకా కేసుకు సంబంధించిన సాక్షాదారాలు కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనలో వైఎస్ఆర్సిపి కి పూర్తి అనుకూలంగా వ్యవహరించారు చోరీ కేసులో ఆధారాలు తారుమారు చేశారని విమర్శలు ఉన్నాయి. అలాగే అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టిన విశాల్ గున్నికి విశాఖ రేంజ్ డీఐజీగా నియమించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -