NTR: తారక్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా?

NTR: రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఒత్తిడి ఉంది. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్‌ ఎక్కడ టీడీపీ మీటింగ్‌ హడావుడి చేస్తుంటారు. అయితే యంగ్‌ టైగర్‌ మాత్రం రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాయి. అయితే మరోసారి పొలిటికల్ న్యూస్‌లోకి వచ్చాడు. తానుగా చెప్పకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉన్న లోకేష్ అన్న మాటలను ఓ వర్గం మరోవిధంగా అర్థం తీయడంతో ఇదంతా జరిగింది.

 

నందమూరి, నారా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. కేవలం కొందరు పుట్టించిన పుకార్లు మాత్రమే. సాధారణంగా ఓ కుటుంబంలో ఉన్న చిన్నపాటి అభిప్రాయభేదాలు మాత్రమే ఈ ఇరు కుటుంబాల్లో ఉన్నాయని చెప్పవచ్చు. బయట కలుసుకున్న సందర్భాలు రాకపోవడం వల్ల వేరే ప్రచారానికి ఆస్కారం దొరికిందే తప్ప ఇంకో కారణం కనిపించదు.

ప్రస్తుతం తారక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు. కొత్త సినిమా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. కొరటాల శివతో ఓ పాన్‌ ఇండియా సినిమాకి సైన్‌ చేశాడు. తర్వలోనే ఆ మూవీ షూటింగ్‌ కూడా ప్రారంభం కాబోతుంది. పైగా ఇది 30 వ సినిమా కావటంతో, తారక్‌పై ఫ్యాన్స్‌ భారీగా ఆశలు పెట్టుకున్నారు.

 

ఇదిలా ఉంటే.. బాలకృష్ణ యువకుడిగా కెరీర్ ఉజ్వలంగా ఉన్నప్పుడు ఎంత అవసరం ఉన్నా సరే టీడీపీ కోసం నేరుగా దిగలేదు. బావ చంద్రబాబుకే వదిలేశారు. బ్లాక్ బస్టర్లు రికార్డులు పీక్స్ చూశాక పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు జూనియర్ చేయాల్సింది కూడా ఇదే. ప్రభాస్, అల్లు అర్జున్, తను, చరణ్ ఇలా టాలీవుడ్ నుంచి వందల కోట్ల మార్కెట్ లీగ్ పెరుగుతోంది. దృష్టికి పక్కకు మళ్లించే ఏ ఆలోచనా చేయకపోవడమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -