Jagan: జగన్ కోసం ఈ ఐపీఎస్ అధికారులు ఏకంగా ఇంతకు తెగించారా?

Jagan: త్వరలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలను పక్కాగా రచిస్తున్నారని తెలుస్తుంది. ఎన్నికలలో ఎలాగైనా గెలుపొంది దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు అయినటువంటి ఐపీఎస్ లను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇలా తమకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు అందరినీ కూడా ఇప్పటినుంచి ఎన్నికల విధులలో భాగంగా వారు అనుకూలమైనటువంటి ప్రాంతాలకు బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

ముందుగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ లను టార్గెట్ చేసి వారికి అనువైన చోట పోస్టింగ్ ఇప్పించారు. అదేవిధంగా తమకు ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ఐపీఎస్ లను కూడా ఎన్నికల విజయానికి భారీ స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది ఐపీఎస్ లను బదిలీలు అయ్యి ఇప్పటికే ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు.

ఇలా బదిలీ అయినటువంటి అధికారులు డ్రగ్ మాఫియా ఔషధాల నియంత్రణ ఎర్రచందనం స్మగ్లింగ్ అనే పోస్టులలో ఉన్నప్పటికీ వీరు లోపల మాత్రం ఎన్నికల డ్యూటీలను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
రాయలసీమలో రిశాంత్‌ రెడ్డి, ప్రకాశంలో పరమేశ్వర రెడ్డి, ఇంటెలిజెన్స్‌లో ఆనంద్‌ రెడ్డి.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష నేతలపై గురిపెట్టేలా రఘురామిరెడ్డికి కీలక బాధ్యతలను వ్యవహరించారు.

 

ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లకుండా అడ్డుకోవడం టిడిపి శ్రేణులనే ప్రధాన లక్ష్యంగా భావించిన ఐపిఎస్ రిశాంత్ రెడ్డి ఎన్నికల కమిషన్‌ నుంచి తప్పించుకోవడానికి ఆయనను జిల్లా నుంచి తప్పించి ఎర్ర చందనం టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేసినట్లు చూపిస్తున్నారు. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అంటూ ఈయన నెల్లూరు రాయలసీమ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటన చేస్తూ ప్రతిపక్షం నేతల వాహనాలను తనిఖీలు చేస్తూ వారిలో ఆందోళనలు కలిగిస్తున్నారు. పైకి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అయినప్పటికీ రిశాంత్ రెడ్డి మాత్రం ఎన్నికల బరిలో దిగారు.

 

కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేయించారు అప్పటినుంచి అధికారిగా ఉన్నారు గత ఏడాది చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం అలాగే ఔషధ నియంత్రణ అధికారిగా అదనపు బాధ్యతలు తీసుకొని నారాయణ వైద్య కళాశాలపై దాడి చేయడం వంటివి చేస్తున్నారు. ఇక రాయలసీమలో టిడిపికి కంచుకోటగా ఉన్నటువంటి అనంతపురానికి వైయస్ కుటుంబానికి గత కొన్ని సంవత్సరాలుగా మద్దతు తెలుపిన పులివెందుల ఏఎస్పీగా ఉన్న అన్బురాజన్‌ బదిలీ చేయబోతున్నారు ఇలా వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ ఆయన ఎన్నికలలో విజయానికి పరోక్షంగా కారణమవుతున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -