YCP: వైసీపీ క్యాడర్లు చేతులెత్తేయడం వెనుక అసలు లెక్కలు ఇవేనా?

YCP: వైసీపీ పరిస్థితి ఎన్నికలు దగ్గరపడే కొద్ది ఘోరంగా తయారవుతోంది. పార్టీ బయట పరిస్తితులు ఎలాగూ అనుకూలించడం లేదు. కానీ.. అంతర్గతంగా ఏమైనా పార్టీలో పరిస్థితులు బాగున్నాయా అంటే అదీ లేదు. నిన్న మొన్నటి వరకూ జగన్ సిట్ అంటే సిట్.. స్టేండ్ అంటే స్టేండ్ అన్నట్టు ఉన్నవారంతా.. అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక విధానంలోనే జగన్ పప్పులో కాలేశారు. సిట్టింగులను మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలకు కొత్త స్థానాలు కేటాయిస్తున్నారు. టికెట్లు నిరాకరించడంతో చాలా మంది పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీని వీడి వేరే పార్టీల్లో చేరిపోయారు. టికెట్ దక్కని వారి పరిస్థితి అలా ఉంటే.. టికెట్ వచ్చినవాళ్ల పరిస్తితి మరోలా ఉంది. గెలుపు అవకాశాలు లేని దగ్గరకు తమను పంపిస్తే ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారట. అసలు పరిచయం లేని ప్రాంతాలకు తమను తరిమేసి గెలవండి అంటే ఎలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

 

టికెట్ రాని వాళ్లే అదృష్టవంతులు అనుకునే పరిస్థితి ఏర్పడిందని టాక్ వైసీపీలో వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. ఈ టైంలో కొత్త ముఖాలకు జనం ఎలా ఓట్లు వేస్తారనే అంతర్మథనంలో ఉన్నారని చర్చ నడుస్తోంది. కొంతమంది పూర్తిగా తెగించి ఆశలు వదులుకున్నారు. అందుకే ప్రచారానికి కూడా వెళ్లడం లేదు. ఓడిపోయేదానికి ఎందుకు ప్రచారం అనుకుంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అలా అని పార్టీ ఫండ్ ఏమైనా వస్తుందా? అంటే అది కూడా లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు ఆవేశపడాలని చాలా మంది సైలెంట్ గా ఉన్నారట. నెల్లూరు ఎంపీ, అవనిగడ్డ, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థులు పూర్తిగా ఇంటికి పరిమితం అయ్యారని టాక్ నడుస్తోంది. వారికి పార్టీ గెలుపుపై కానీ, అభ్యర్థి గెలుపుపై కానీ ఆశలు లేవట. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అధిష్టానం వారి ప్రచారంపై ఫోకస్ చేసిందని టాక్. ప్రచారం జోరు లేకపోతే వారికి అధిష్టానం నుంచి కాల్స్ వెళ్తున్నాయని తెలుస్తోంది. కానీ, అధిష్టానం కాల్స్ ను కూడా పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. 175 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరింత మంది అధిష్టానానికి మేకులా తయారవుతాని పార్టీ అంతర్గత చర్చల్లో తేలిందట.

కొంతమంది పోటీకి ఉత్సాహంగా ఉన్నా.. వారి పరిస్థితి మరోరకంగా ఉంది. ఇప్పటి వరకు వైసీపీ ఆరు జాబితాలను విడుదల చేసింది. అయితే, చివరి రెండు జాబితాలు చూసిన తర్వాత వాళ్లలో ఉన్న మూడు, ఉత్సాహం పోయాయని తెలుస్తోంది. ఎందుకంటే.. మొదటి నాలుగు జాబితాల్లో ప్రకటించిన కొందరి అభ్యర్థులను మార్చుతూ 5,6 జాబితాలు వచ్చాయి. దీంతో.. ఇప్పుడే ప్రచారం మొదలు పెడితే.. రేపటి జాబితాలో తమ పేరు ఉంటుందో ఉండదో అన్న భయం కొందరిలో ఉంది. అందుకే వారు కూడా గడప కదలడం లేదట. పార్టీ ఎలాగూ ఫండ్ ఇవ్వడం లేదు. ఇప్పటి నుంచే డబ్బు ఖర్చు చేయడం ఎందుకు అనుకుంటున్నారట. అసలే యాత్ర2 కి సొంత డబ్బులతో సినిమా టికెట్లు పంచిపెట్టాం. ఇప్పుడే ప్రచారం మొదలు పెడితే డబ్బులు నీళ్లులా ఖర్చు అవుతాయి. ఇంత అయిన తర్వాత టికెట్ మార్చేస్తే ఇక మన పని అంతేఅనుకుంటున్నారట. మరి ఈ సమస్యలకు వైసీపీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -