Jagan: సీఎం జగన్ కష్టాల వెనుక అసలు కారణాలు ఇవేనా?

Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సమస్యలు వలయంలో చిక్కుకున్నారు ముఖ్యంగా తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జగన్ మెడకు చుట్టుకునేలా ఉందని తెలుస్తోంది. ఇలా రోజుకో సమస్య వైసిపి పార్టీకి,ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయని తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలను చాలా అవలీలగా దాటుకుంటూ ముందుకు వెళ్లారు.

ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈయన తన సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఎన్నో సమస్యలను అధిగమించిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎందుకు ఇలాంటి సమస్యల వలయంలో చిక్కుకున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయం గురించి కాస్త లోతుగా ఆలోచిస్తే ఆయన పక్కన ఎంపీ విజయసాయిరెడ్డి లేవకపోవడమే లోటు అని స్పష్టంగా తెలుస్తుంది.

 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ను చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించడం కోసం విజయ్ సాయి రెడ్డి ఎంతో చేశారు. ఆయన తెర వెనుక ఎంతో మంది కాళ్లపై పడి జగన్ ఇచ్చిన టాస్కులు పూర్తిచేసి ఆ సమస్య బయటకు రాకుండా పరిష్కరించేవారు. అయితే ప్రస్తుతం విజయ్ సాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతూ వచ్చారు.ఇలా విజయసాయిరెడ్డిని కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వారికి దగ్గర కావడంతో విజయసాయిరెడ్డి కూడా తన మానాన తన పని తను చేసుకోబోతున్నారు.

 

జగన్ తనని దూరం పెట్టడంతో ఆయన కూడా ఏ విధమైనటువంటి విషయాల గురించి పట్టించుకోకుండా ఢిల్లీలో ఉంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి పెద్దగా పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడటం లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోకుండా నిండా మునిగిన తర్వాత జగన్ తనని కాపాడే వాళ్ళ కాళ్ళను పట్టుకోవడం అలవాటని ఇప్పుడు కూడా అదే జరగబోతుందని పలువురు భావిస్తున్నారు. ఒకవేళ విజయసాయిరెడ్డి కనక తన వెనుక ఉంటే జగన్ వరకు ఇన్ని సమస్యలు వెళ్లేవి కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -