Gudivada Constituency: గుడివాడ నియోజకవర్గంలో సామాన్యుల కష్టాలివే.. వైసీపీ పాలనలో నోరు ఎత్తాలంటే భయమంటూ?

Gudivada Constituency: గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాల నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బూతుల మంత్రిగా, పేకాట పాపారాయుడిగా బాగా గుర్తింపు పొందారు. క్యాసినో కింగ్ అని టీడీపీ విమర్శలు చేస్తూ ఉంటుంది. చట్ట సభలో ఎలా ఉండకూడదో ఆయన ఒక ఉదాహరణ. ఓ ప్రజా ప్రతినిధి ఎలా మాట్లాడ కూడదో అలా నాని మాట్లాడుతారు. ఎవరైన కొడాలి నాని నోట్లో పడితే ఇక అంతే అనుకునేలా చేస్తాడు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టడానికి వైసీపీ అధినేత జగన్.. కొడాలి నానిని దించుతారు. చంద్రబాబును నొటికొచ్చినట్టు మాట్లాడాలంటే కొడాలి నాని తర్వాతే. పాలసీలపై మాట్లాడుకుండా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. చంద్రబాబు వయసు, స్థాయికి కూడా కొడాలి నాని గౌరవం ఇవ్వరు. కొడాలని నాని నోటికి భయపడే టీడీపీ నేతలు ఎక్కువగా ఆయన్ని విమర్శించరు. తోటి నేతల పరిస్థితే అలా ఉంటే సొంత నియోజకవర్గంలో ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుంది? అంతో ఇంతో ఆస్తులు ఉన్నవారు అయితే.. నాని అవసరలం లేకుండా బతికేస్తారు. కానీ, సామాన్యులు ఏదో ఒక అవసరం కోసం నాని దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటీ?

గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోనూ 80 శాతం మిడిల్ క్లాస్, అంతకంటే తక్కువవారే ఉన్నారు. అయితే.. గడిచిన 20 ఏళ్లుగా వారికి నోరుంది… కానీ, నోట మాటే లేదు. నాని దాష్టీకాల‌ను ప్రశ్నించే, ఎదురు నిలిచే ధైర్యం కూడా లేదు. కనీసం వారి స‌మ‌స్యలను నాని దగ్గర ప్రస్తావించే పరిస్థితి కూడా లేదు. కొంచెం ఆలస్యం అయినా..పరిస్థితులు అలా ఉండిపోవు. ఏదో ఒకరూపంలో మారుతాయి. ఇప్పుడు గుడివాడ ప్రజల పరిస్థితి కూడా మారింది. వారు అప్రక‌టిత నియంతృత్వం నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వ‌రకు క్యాసినో, పందేలు, చీట్ల పేక‌లు వంటివి నిర్వహించినా.. స్థానిక ప్రజలు మౌనంగా భ‌విస్తూ వ‌చ్చారు. కానీ, ఇప్పుడు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము, సామాన్యుల పాలిట పెన్నిదిలా ముందుకు వచ్చారు. స్థానికుల్లో కోటి ఆశ‌లు నింపుతున్నా రు. త‌మ క‌ష్టాలు చెప్పుకొనేందుకు తమకు ఎవరు లేరు..ఇంక రారు అనుకున్న సామాన్యులకు ఊహించని రీతిలో తూర్పున ఉద‌యించిన సూర్యుడిలాగా వెనిగండ్ల రాము

వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము ప్రతీ రోజూ 15 గంటలు ప్రజలతో మమేకం అవుతూ తిరుగుతున్నారు. ప్రజలు తమ వద్దకు వస్తే.. కలవడం కాదు.. ఆయన ప్రజలు దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. దీంతో.. ప్రజల్లో ఓ ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు ప్రజలు ధైర్యంగా బయటకు వస్తున్నారు. ప్రతీ సమస్యపై మాట్లాడుతున్నారు. 20 ఏళ్లుగా ఎంత నిర్భందానికి గురైయ్యామో చెబుతున్నారు.

నోరు ఎత్తాలంటే భ‌యం. ఎక్కడిక‌క్కడ నిఘా. ఏ చిన్న మాట అన్నా.. దౌర్జన్యం. దాడులు. ఇంక తమ క‌ష్టాలు ఎవ‌రికి చెప్పుకోవాలి? ఏం చెప్పడానికి వీల్లేని ప‌రిస్థితి అని స్థానికులు వారి గోడును వెల్లబుచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా.. సరైన నేత తమకు ఎదురు కాలేదని అంటున్నారు. ఇప్పుడు వెనిగండ్లను భారీ మెజార్టీతో గెలిపించుకొని వెనిగండ్లను అసెంబ్లీకి పంపిస్తామని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -