YCP MLA: ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ దృష్టిలో బ్యాడ్ అయ్యారా.. ఏమైందంటే?

YCP MLA: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులకు ఐపాక్ ఫీవర్ పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సర్వే ద్వారా ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరును సర్వే చేస్తున్నారు. అయితే ఐ ప్యాక్ సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికలలో ఎవరికి టికెట్ ఇవ్వాలి వద్దు అన్న ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైసిపి ఇద్దరు ఎమ్మెల్యేలకు ఐపాక్ ఫీవర్ భారీగా పట్టుకుందని తెలుస్తుంది.

ముఖ్యంగా..గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను సమస్యలపై స్థానికులు నిలదీస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా వైసీపీ స‌ర్వే సంస్థ ఐప్యాక్‌ బృందం సర్వే నిర్వహించింది. జనంలో అసంతృప్తి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య పదులలో ఉందని ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీరికి వచ్చే ఎన్నికలలో టికెట్ వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో ఉన్నారు.ముఖ్యంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్మోహన్ దృష్టిలో పూర్తిగా బాడ్ అయ్యారు అనే చెప్పాలి మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనే విషయానికి వస్తే..

 

చిత్తూరు, పలమనేరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, వెంకటేశ్ గౌడల‌పై స‌ర్వేలో యాంటీ రిజ‌ల్ట్ వ‌చ్చిన‌ట్టు సమాచారం. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో భూమి అక్రమాలు నిర్వహించారని తెలుస్తుంది. ఇక ఈయన పేరు చెప్పుకొని రెండో పార్టీ నాయకులు భారీ స్థాయిలో దండాలు నిర్వహిస్తున్నారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ప్రజల ముందుకు వెళ్లడంతో ప్రజలు శ్రీనివాసులను నిలదీస్తున్నారు.

 

మరోవైపు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ పరిస్థితి కూడా ఇదే విధంగానే ఉంది. పలమనేరు సమీపంలోని ఓ క్వారీని ఈయన స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పలమనేరులో ఎక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలన్న తప్పకుండా ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకొని ఆయనకు అందాల్సినవి అందజేయాల్సి ఉంటుందని ఈ సర్వేలో తేలింది దీంతో వీటితో వచ్చే ఎన్నికలలో టికెట్ వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -