YCP: ఏపీలో వైసీపీ తుపాకులు గురి తప్పుతున్నాయా.. ఏం జరిగిందంటే?

YCP: వైయస్సార్సీపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి పట్ల ఎవరైనా అవహేళనగా మాట్లాడిన వెంటనే వైఎస్ఆర్సిపి మంత్రులు వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తూటాలాంటి మాటలతో విమర్శలు కురిపిస్తూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు కొనాలి నాని పేర్ని నాని రోజా అంబటి రాంబాబు వంటి వారందరూ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

 

ఇలా వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల ఎవరైనా అణిచిత వ్యాఖ్యలు మాట్లాడితే వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారిపై విమర్శలు కురిపిస్తూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేతలను విమర్శించిన వీరందరూ కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై గురి పెడుతున్నారు.

వీరీ నోటి నుంచి ఏదైనా మాట వచ్చింది అంటే అది జగన్ ఆదేశం లేనిదే రాదు అనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్ అనుమతితోనే వీరందరూ కూడా ప్రతిపక్షం పై దాడి చేస్తూ ఉంటారు ఇప్పుడు షర్మిల పట్ల కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నడంతో జగన్ ఆదేశాలు ప్రకారమే అలా మాట్లాడుతూ ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

 

ప్రతిపక్షాలతో జగన్ ఒంటరి పోరాటం చేస్తూ ఉండగా జగన్ సైన్యంతో షర్మిల కూడా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీరందరూ కూడా ఇతరులపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పటికీ షర్మిల విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈమె విషయంలో ఇలా వ్యవహరించడానికి కారణం లేకపోలేదు.

 

గత నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు జగన్ భజన చేస్తున్నటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతున్న సంగతి మనకు తెలిసిందే. వీరందరూ కూడా టికెట్ రాకపోతే కాంగ్రెస్ లోకి వెళ్లే పరిస్థితులు కూడా ఉన్నాయి లేదంటే హంగ్ ఏర్పడి షర్మిల రాజీకి వస్తే తమ పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారని తెలుస్తోంది.అందుకే షర్మిల విషయంలో ఎమ్మెల్యేలు మంత్రులు కాస్త వెనకడుగు వేస్తున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -