YS Jagan: ఖండాంతరాలు దాటుతున్న జగన్ రుణ దాహం.. విదేశీ సంస్థలను సైతం వదలడం లేదా?

YS Jagan: రాష్ట్రాలు, దేశాలు దాటిన ఏపీ ప్రభుత్వం అప్పులు.. ఇప్పుడు ఖండాలను కూడా దాటేసింది. ఆర్బీఐ సహా పలు బ్యాంకులతో పాటు ఫైనాన్స్ కంపెనీల దగ్గర ఇబ్బడి ముబ్బడిగా అప్పుడు చేసిన జగన్ సర్కార్.. విదేశీ సంస్థల దగ్గర కూడా అప్పులు చేస్తోంది. అలా అని ప్రపంచ బ్యాంక్, ఆసియా బ్యాంక్ లాంటి సంస్థల దగ్గర తీసుకుంటే పర్వాలేదు. కానీ..ముక్కు, మొహం తెలియని సంస్థలకు లక్షల కోట్ల విలువైన ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. దేశంలో ఆర్బీఐ లాంటి సంస్థలు అప్పు ఇవ్వడానికి నిరాకరించాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియా బ్యాంక్ ల దగ్గర కూడా అప్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు అప్పు దొరకకపోవడంతో.. ముక్కు, మొఖం తెలయని సంస్థల వెంట పడుతున్నారు. గుర్తు తెలియని ఓ విదేశీ సంస్థ ద్వారా జగన్ సర్కార్ ఇటీవల రూ.14 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. అందులో మార్చి 1 రూ.7 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరిపోయాయి. మరో రూ.7 వేల కోట్లు మే 2న అందనున్నాయి. దీనికోసం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆదాయాన్ని తాఖట్టు పెట్టారు.

విదేశాల నుంచి బీఎస్‌ఈ ద్వారా అప్పులు వస్తున్నట్టు సెబీ, ఆర్‌బీఐకి ఏపీఎండీసీ సమాచారం ఇచ్చింది. అయితే, ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ను నమ్మి ఇన్ని వేల కోట్లు అప్పు ఇస్తున్న సంస్థ ఏంటీ అని ఆరా తీసినా తెలియడం లేదు. ఎందుకో ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతోంది ఏపీ సర్కార్. ఫిబ్రవరి 27, 28, 29 తేదీల్లో ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ విడుదల చేసిన ఎన్‌సీడీ (నాన్‌కన్వర్టబుల్‌ డిబెంచర్లు) లను రూ.7000 కోట్లతో ఆ విదేశీ ఇన్వెస్టర్‌ కొనుగోలు చేశారు. ఏకంగా గనుల శాఖ ఆస్తులను సెక్యూరిటీగా పెట్టినప్పటికి కూడా తీసుకున్న అప్పునకు జగన్ సర్కార్ అన్‌కండిషనల్‌ గ్యారెంటీ ఇచ్చింది. అంటే.. తీసుకున్న డబ్బు అనుకున్న సమాయానికి తిరిగి ఇవ్వకపోతే.. వడ్డీలు చెల్లించకపోతే… నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి ఏపీఎండీసీ బాండ్‌ సర్వీసింగ్‌ అకౌంట్‌కు డబ్బులు వెళ్లిపోతాయి. ఆ డబ్బు అప్పు ఇచ్చినవారి అకౌంట్ లో క్రెడిట్ అవుతోంది.

ఈ మొత్తం ప్రాసెస్‌ చాలా అనుమానాలకు తావిస్తోంది. ఏపీఎండీసీ జారీ చేసిన ఎన్‌సీడీలకు ఎలాంటి రేటింగ్ లేదు.. కానీ, ఇన్వెస్టర్ మాత్రం 8.70శాతం వడ్డీకే రూ.14 వేల కోట్లు ఎలా ఇస్తున్నారో అర్థం కావడం లేదు. 2022 జూన్‌లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ విడుదల చేసిన బాండ్లకు ’ఏఏ’ రేటింగ్‌ ఉంది. వాటిపై 9.62% వడ్డీరేటు ఉంది. 2018 ఆగస్టులో సీఆర్‌డీఏ బాండ్లకు ’ఏ’ రేటింగ్‌ ఇచ్చారు. దానిపై 10.32% వడ్డీరేటుకు అప్పు తీసుకున్నారు. 2022 జూన్‌లో రెపో రేటు 4.9% గా ఉంది. కానీ.. ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. ఈ లెక్కన చూస్తే.. కనీసం 15 శాతం వడ్డీ అయినా వసూలు చేయాలి. కానీ, ఆ అప్పు ఇచ్చిన సంస్థ మాత్రం 8.7 శాతానికే ఇన్ని వేల కోట్లు ఇచ్చింది. దీంతో.. అప్పుగా వచ్చిన డబ్బు బ్లాక్ మనీ ఏమో అనే అనుమానం కులుగుతోంది. బ్లాక్ ను వైట్ చేసుకోవడం కోసం ఇలా చేస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు మే2 న మిగిలిన సొమ్ము ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సి ఉంది. కానీ.. దీనికి క్యాబినెట్ ఆమోదం ఉందా? మొదట వచ్చిన డబ్బు కోసం ఆఘమేగాల మీద కేబినేట్ ఆమోదించింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది కనుక కేబినెట్ లేదు. కానీ.. ఆ డబ్బు ఎలా తీసుకొస్తారు? ఆ డబ్బు తీసుకొని వచ్చి… మే 2 తర్వాత పలు పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని అనుకుంటున్నారు. కానీ… అది కోడ్ ఉల్లంఘన అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -