2000 note: రూ.2000 నోటును వ్యాపారులు తిరస్కరించడానికి అసలు కారణమిదా?

2000 note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా 2000 రూపాయల నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం మాత్రమే కాకుండా ఈ నోట్లనూ సెప్టెంబర్ 30లోగా బ్యాంకులలో మార్పులు చేసుకోవచ్చని కొన్ని గైడ్లైన్స్ కూడా జారీ చేశారు. అయితే2000 రూపాయల నోటును రద్దు చేస్తున్నారని తెలియడంతో ఇన్ని రోజులు ఈ నోట్లన్నీ ఎత్తి పెట్టుకున్న వారందరూ కూడా వాటిని బయటకు తీస్తున్నారు.

ఈ క్రమంలోనే 2000 రూపాయల నోటు మార్పిడి చేసుకోవడానికి చాలా సమయం ఉన్నప్పటికీ పలుచోట్ల ఈ రెండు వేల రూపాయల నోటును ఇప్పటికే పలు వ్యాపారాలు చేసేవారు ఈ నోట్లను ఏ మాత్రం తీసుకోవడం లేదు చేతిలో2000 రూపాయలు నోటు ఉన్నా కూడా చిల్లర లేదని తప్పించుకుంటున్నారు అయితే ఇలా వ్యాపారస్తులు 2000 రూపాయల నోట్లు తీసుకోకపోవడానికి కారణం ఉంది.

 

ఇలా 2000 రూపాయల నోటులను తీసుకోవడం వల్ల బ్లాక్ మనీ అంటూ ఐటీ అధికారులు తలనొప్పులు భరించాల్సి వస్తుంది అన్న కారణంగా వ్యాపారస్తులు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది. ఈ నోటు ఇప్పటికే సామాన్య జనాలకు దూరమైంది. కొద్దోగొప్పో ఎవరి దగ్గరైనా మిగిలితే, ఇప్పుడిలా వ్యాపారస్తులు నిరాకరిస్తున్నారు. దీంతో నోటు చేతిలో ఉంటే బ్యాంకులకు వెళ్లడం మరో మార్గం లేదని తెలుస్తోంది.

 

బహుశా ఆర్బీఐ ఇది ఊహించి ఉండదు. ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలైంది, రాబోయే రోజుల్లో బ్యాంకుల కంటే ముందు జనాల చేతుల్లోకి 2000 రూపాయల నోట్లు ఎక్కువగా వస్తాయని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు రాబోయే కొద్ది రోజులలో ఈ రెండు వేల రూపాయల నోటులు బ్యాంకులో కన్నా సామాన్య ప్రజల చేతిలోనే ఎక్కువగా కనపడతాయని భావిస్తున్నారు.అయితే బ్యాంకులో 2000 రూపాయల నోట్లు తిరస్కరిస్తే ఏం చేయాలనే గైడ్ లైన్స్ ఇప్పటికే ఆర్బీఐ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -