CM Jagan: సీఎం జగన్ కు ఆరోగ్యశ్రీ షాక్.. అక్కడ సేవలు నిలిచిపోయాయిగా!

CM Jagan: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో పేద ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటంతో ఆరోగ్య శ్రీ సేవలను హాస్పిటల్ యాజామాన్యాలు నిలిపివేయాలని నిర్ణయించాయి. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ప్రభుత్వానికి ఆస్పత్రుల యాజమాన్యాలు షాక్ ఇచ్చాయి. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు కడప నగరంలో పలు ఆస్పత్రులు బోర్డులు కూడా పెట్టేశాయి. కడపలో మొత్తం 18 ఆస్పత్రులకు గాను 17 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు బోర్డులు పెట్టాయి. సీఎం సొంత ఇలాకాలో ఇదేం చాలా అవమానం అని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ క్రమంలో బోర్డులు పెట్టిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసిన 17 ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే రాజమండ్రిలో 14, విశాఖలో నాలుగు ఆస్పత్రుల లైసెన్స్‌ను ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలు ఆసుపత్రులు గురువారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేశాయి. ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రూ.1200 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ప్రభుత్వం హడావిడిగా రూ.190 కోట్ల బకాయిలు విడుదల చేసింది. అయితే మొత్తం బకాయిలు విడుదల అయ్యే వరకు చర్చలకు వెళ్లవద్దని ఆసుపత్రుల యాజమాన్య కమిటీకి ఆస్పత్రులు స్పష్టం చేశాయి. గత నెలలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వానికి ఆసుపత్రుల యాజమాన్య సంఘం సమాచారం ఇచ్చింది. గత నెలలో నోటీసులు ఇచ్చి 29 నుంచి సేవలు నిలిపి వేస్తామని సంఘం చెప్పింది. ఎన్నికల తరుణంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తే అవకావం ఉంది. దీంతో వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఆస్పత్రులకు వెయ్యి కోట్ల రూపాయల వరకూ బిల్లులు పెండింగులో ఉన్నాయి. పలు శస్త్ర చికిత్సల ఛార్జ్‌లు పెంచాలని ఎప్పటి నుంచో ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 29 నుంచి సేవలు నిలిపివేస్తామని లేఖ రాశాయి. గతంలో జరిగిన చర్చల్లో బకాయిలు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. 20 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూలమైన హామీ ఆస్పత్రులకు లభించలేదు. విసిగిన యాజమాన్యాలు వెంటనే సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -